ప్రముఖ గాయని బాంబే జయశ్రీ(Singer Bombay Jayashri) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. తీవ్రమైన మెడనొప్పి(Neck Pain )తో ఆమె కిందపడిపోయారు. ప్రస్తుతం బ్రిటన్(Britain)లో ఉన్న జయశ్రి లివర్‌పూల్‌లోని ఓ హోటల్‌లో అపస్మారక స్థితిలో సిబ్బందికి కనిపించారు. వెంటనే ఆమెను హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. ఆమెకు కీ హోల్ సర్జరీ(Hole Surgery) జరిపారు వైద్యులు.
ప్రముఖ గాయని బాంబే జయశ్రీ(Singer Bombay Jayashri) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. తీవ్రమైన మెడనొప్పి(Neck Pain )తో ఆమె కిందపడిపోయారు. ప్రస్తుతం బ్రిటన్(Britain)లో ఉన్న జయశ్రి లివర్‌పూల్‌లోని ఓ హోటల్‌లో అపస్మారక స్థితిలో సిబ్బందికి కనిపించారు. వెంటనే ఆమెను హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. ఆమెకు కీ హోల్ సర్జరీ(Hole Surgery) జరిపారు వైద్యులు. ప్రస్తతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉంది. మెడిసిన్స్‌కు కూడా ఆమె ప్రతిస్పందిస్తుందని డాక్టర్లు చెప్పారు. ఆమె పూర్తిగా కోలుకున్న తర్వాత చెన్నైకు చేరుకుంటారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లోనే కాదు, హిందీ సినిమాల్లో కూడా జయశ్రి పాటలు పాడారు. కేంద్ర ప్రభుత్వం ఆమెను పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. ఆమెకు సంగీత కళానిధి అవార్డు(Sangita Kalanidhi award)ను ప్రదానం చేయనున్నట్టు సంగీత అకాడమీ ప్రకటించింది. ఆమె త్వరగా కోలుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.