హైదరాబాద్‌(Hyderabad) నగరంలోని రాడిసన్‌ హోటల్‌(Radison Hotel) కేంద్రంగా జరిగిన డ్రగ్స్‌ పార్టీ కేసులో(Drugs case) ఒక్కొక్కరి బాగోతం బయటపడుతోంది. అనేక మలుపులు తిరుగుతున్న ఈ కేసులో ఇప్పటికే కొందరు సినీ, రాజకీయ ప్రముఖుల పేర్లు వినిపించాయి. ఇదిలా ఉంటే ఈ కేసుకు సంబంధించిన రిమాండ్‌ రిపోర్టులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. డ్రగ్స్‌ పెడ్లర్‌ అబ్బాస్‌ ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం.. మీర్జా వహీద్(Mirza Waheed) దగ్గర అబ్బాస్‌(abbas) తరుచుగా కొకైన్(Cocaine) కొనుగోలు చేస్తున్నాడు. ఇలా కొనుగోలు చేసిన కొకైన్‌ను అబ్బాస్‌ ఏం చేస్తారంటే గజ్జల వివేకానంద్ డ్రైవర్ గద్దల ప్రవీణ్‌కు ఇస్తాడు

హైదరాబాద్‌(Hyderabad) నగరంలోని రాడిసన్‌ హోటల్‌(Radison Hotel) కేంద్రంగా జరిగిన డ్రగ్స్‌ పార్టీ కేసులో(Drugs case) ఒక్కొక్కరి బాగోతం బయటపడుతోంది. అనేక మలుపులు తిరుగుతున్న ఈ కేసులో ఇప్పటికే కొందరు సినీ, రాజకీయ ప్రముఖుల పేర్లు వినిపించాయి. ఇదిలా ఉంటే ఈ కేసుకు సంబంధించిన రిమాండ్‌ రిపోర్టులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. డ్రగ్స్‌ పెడ్లర్‌ అబ్బాస్‌ ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం.. మీర్జా వహీద్(Mirza Waheed) దగ్గర అబ్బాస్‌(abbas) తరుచుగా కొకైన్(Cocaine) కొనుగోలు చేస్తున్నాడు. ఇలా కొనుగోలు చేసిన కొకైన్‌ను అబ్బాస్‌ ఏం చేస్తారంటే గజ్జల వివేకానంద్ డ్రైవర్ గద్దల ప్రవీణ్‌కు ఇస్తాడు. గ్రామ్‌ కొకైన్‌ను 14 వేల రూపాయల పెట్టి కొనేవాడట గజ్జల వివేక్‌. దాంతో పాటు కొకైన్‌ సరఫరా చేసినందుకు వివేక్‌ దగ్గర అబ్బాస్‌ కమీషన్‌ డబ్బులు కూడా తీసుకునేవాడట! ఏడాది కాలంలో బీజేపీ నేత గజ్జల యోగానంద్‌(Gajjala Yoganand) కుమారుడు గజ్జల వివేకానంద(Gajjala Vivekananda) డ్రగ్స్‌కు అలవాటుపడ్డాడని తెలుస్తోంది. ఈ కేసులో ఉన్న నిందితులందరూ సంవత్సర కాలంగా రాడిసన్‌లో డ్రగ్స్ వాడుతున్నారు. ఈనెల 16, 18, 19, 24వ తేదీలలో కూడా గజ్జల వివేక్‌కు అబ్బాస్‌ కొకైన్‌ను ఇచ్చినట్టు చెప్పాడు. మరోవైపు గజ్జల వివేక్ డ్రగ్ పార్టీల వివరాలను వాట్సాప్ చాటింగ్స్‌, గూగుల్ పే పేమెంట్స్ ఆధారాలను కూడా పోలీసులు సేకరిస్తున్నారు. ఈ కేసులో గజ్జల వివేక్ స్నేహితులు, సహ నిందితులు దర్శకుడు క్రిష్, సెలగంసెట్టి కేదార్, నిర్భయ్ సింధి, రఘు చరణ్, సందీప్, స్వేత, లిషి, నేయిల్ సంవత్సర కాలంగా రాడిసన్ హోటల్‌లో డ్రగ్స్ పార్టీలు జరిపినట్లు పోలీసులు గుర్తించారు. పరారీలో ఉన్న రఘుచరణ్‌, సందీప్‌, నీల్‌, శ్వేత, యూట్యూబర్‌ లిషి తదితరుల ఆచూకీ దొరకలేదు. ఇప్పటికే అరెస్టయిన నిందితులు ఫోన్‌ డేటా, లావాదేవీల ఆధారంగా పోలీసులు కొంతమంది వివరాలు సేకరించినట్లు తెలిసింది. డ్రగ్స్‌ పార్టీకి సినీ దర్శకుడు క్రిష్‌ హాజరైనట్లు దర్యాప్తులో తేలడంతో పోలీసులు ఆయనను విచారణకు పిలిచారు. శుక్రవారం విచారణకు వస్తానని క్రిష్‌ చెప్పారట! చిత్రమేమిటంటే రాడిసన్‌ హోటల్‌లో మొత్తం 200 కెమెరాలుంటే 20 మాత్రమే పనిచేయడం. ముఖ్యంగా పార్టీలు నిర్వహించిన 1200, 1204 గదుల సమీపంలోని కెమెరాలు పనిచేయడం లేదట! అందుకే నిందితులు ఈజీగా తప్పించుగలుగుతున్నారు.

Updated On 29 Feb 2024 1:01 AM GMT
Ehatv

Ehatv

Next Story