Sharmila's entry into AP politics: ఏపీ రాజకీయాల్లోకి షర్మిల ఎంట్రీ..జగనే టార్గెట్‌గా కాంగ్రెస్ వదిలిన బాణం !
అంతా అనుకున్నట్టే జరిగింది. కాంగ్రెస్‌లోకి వైఎస్ షర్మిల(ys sharmila) ఎంట్రీ ఇచ్చారు. ఆగ్రనేతలు ఖర్గే (Karge), రాహుల్ గాంధీ(Rahul Gandhi)ల సమక్షంలో కండువా కప్పుకున్న షర్మిల.. తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేస్తున్నట్టు ప్రకటించారు. అయితే కాంగ్రెస్ లో చేరిక సందర్భంగా షర్మిల ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
అంతా అనుకున్నట్టే జరిగింది. కాంగ్రెస్‌లోకి వైఎస్ షర్మిల(ys sharmila) ఎంట్రీ ఇచ్చారు. ఆగ్రనేతలు ఖర్గే (Karge), రాహుల్ గాంధీ(Rahul Gandhi)ల సమక్షంలో కండువా కప్పుకున్న షర్మిల.. తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేస్తున్నట్టు ప్రకటించారు. దీంతో 2021 జులై 8న ప్రారంభమై..ఏ ఎన్నికలోనూ పోటీ చేయకుండానే వైఎస్పార్టీపీ ప్రస్థానం(Ysrtp journey) ముగించింది. అయితే కాంగ్రెస్ లో చేరిక సందర్భంగా షర్మిల ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రనేకాదు..అండమాన్‌లో పార్టీ బాధ్యతలు అప్పగించినా శక్తివంచన లేకుండా పని చేస్తానని ప్రకటించారు. అయితే కాంగ్రెస్ మాత్రం..జగన్ టార్గెట్‌గానే(Jagan target) షర్మిలను ఆంధ్ర రాజకీయాల్లో ఉపయోగించుకోనున్నట్టు తెలుస్తోంది. అందులో భాగంగానే షర్మిలకు ఏపీపీసీసీ బాధ్యతలు (APPCC Responsibilities) అప్పగించనున్నట్టు సమాచారం.
ఏపీలో పదేళ్ల క్రితం రాష్ట్ర విభజనతో కుదేలైన కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం తీసుకొచ్చేందుకు హైకమాండ్ శతప్రయత్నాలు చేస్తోంది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి(YS Rajasekhar Reddy) కుమార్తెకు పార్టీ పగ్గాలు అప్పగించడం ద్వారా ఏపీలో పట్టు సాధించాలని యోచిస్తోంది. గురువారం ఢిల్లీలో అగ్రనేతల సమక్షంలో పార్టీలో చేరిన షర్మిలకు ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు అప్పగించడమే తర్వాయి అనే ప్రచారం ఊపందుకుంది. ఏపీలో మరోసారి అధికారంలోకి వచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్న వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ ఇప్పటివరకూ టీడీపీ, జనసేనను లైట్ తీసుకుంటున్నారు. కానీ చెల్లెలు షర్మిలకు ఏపీలో కాంగ్రెస్ బాధ్యతలు అప్పగిస్తే మాత్రం లైట్ తీసుకునే పరిస్ధితి కచ్చితంగా ఉండదు. షర్మిలకు ఏపీ కాంగ్రెస్ పగ్గాలు చేపడితే.. వైఎస్ జగన్ వర్సెస్ వైఎస్ షర్మిల(Ys Jagan Vs Ys Sharmiala) పోరుగా మారే అవకాశం లేకపోలేదన్నది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. మరోవైపు తెలంగాణలో లోపాయికారిగా రేవంత్‌రెడ్డి(Revanth Reddy)కి మద్దతిచ్చిన చంద్రబాబు(Chandrababu).. షర్మిల చేరికతో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుంటారనే ప్రచారం జరుగుతోంది. అందుకే.. కాంగ్రెస్‌లో షర్మిల చేరికను పరోక్షంగా ప్రస్తావిస్తూ..తమ కుటుంబాల్లో రాజకీయ చిచ్చు పెట్టేందుకు కొందరు కుట్రలు, కుతంత్రాలు చేస్తున్నారని సీఎం జగన్ చేసిన ఆరోపణలపై ఏపీ పొలిటికల్ సర్కిల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. అదే జరిగితే..రాబోయే రోజుల్లో ఏపీ రాజకీయాలు రసవత్తరంగా మారడం ఖాయం.
.