వైఎస్సార్టీపీ అధినేత షర్మిల కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. కాంగ్రెస్‎లో వైఎస్సార్టీపీ పార్టీని విలీనం చేశారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా షర్మిల కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ హైకమాండ్ తనకు ఏ బాధ్యత కట్టబెట్టినా నిబద్ధతో పని చేస్తానని అన్నారు. ఈ సందర్భంగా దివంగత మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డిని గుర్తు చేశారు.

వైఎస్సార్టీపీ అధినేత వైఎస్ షర్మిల(YSRTP chief YS Sharmila) కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. కాంగ్రెస్‎లో వైఎస్సార్టీపీ(ysrtp)ని విలీనం చేశారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు(Congress Party National President) మల్లికార్జున ఖర్గే(Mallikarjuna Kharge)సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా షర్మిల కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ హైకమాండ్(Congress High Command) తనకు ఏ బాధ్యత కట్టబెట్టినా నిబద్ధతో పని చేస్తానని అన్నారు. ఈ సందర్భంగా దివంగత మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి(Late former CM YS Rajasekhar Reddy)ని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ కోసం జీవితాంతం పని చేసిన వైఎస్ అడుగుజాడల్లోనే.. తను నడుస్తున్నానని అన్నారు. దేశంలో అతిపెద్ద సెక్యులర్ పార్టీ కాంగ్రెస్సేనంటూ కొనియాడిన షర్మిల.. రాహుల్ గాంధీ(Rahul Gandhi)ని ప్రధానిగా చూడటమే తన లక్ష్యమన్నారు. ఇక దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాల్సిన అవశ్యకతను గుర్తు చేశారు. సెక్యులర్ పార్టీ కేంద్రంలో అధికారంలో లేనందు వల్లే మణిపూర్ అల్లర్లు(Manipur riots) జరిగాయని అభిప్రాయపడ్డారు. మణిపూర్‌లో 2వేల చర్చిలను ధ్వంసం చేసిన ఘటన తనను కలిచివేసిందన్నారు.

Updated On 4 Jan 2024 12:51 AM GMT
Ehatv

Ehatv

Next Story