Shakira Imprisonment : జైలుశిక్ష తగ్గింపు కోసం పాప్ సింగ్ షకీరా ఏం చేసిందంటే...!
పాప్‌స్టార్ షకీరా(Shakira) తన జైలు శిక్షను తగ్గించుకున్నారు. అందుకోస ఆమె అధికారులతో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇంతకీ ఆమెకు జైలు శిక్ష(Imprisonment) ఎందుకు పడిందో, ఆ శిక్షను ఎలా తగ్గించుకున్నారో ఇప్పుడు తెలుసుకుందాం! 2012-2014 మధ్య కాలంలో స్పెయిన్(Spain) ప్రభుత్వానికి 131 కోట్ల రూపాయల పన్ను(Tax) చెల్లించలేదనే ఆరోపణలు షకీరాపై వచ్చాయి. దాంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని ప్రాథమిక విచారణ జరిపించారు. విచారణ తర్వాత షకీరాకు ఎనిమిదేళ్ల రెండు నెలల జైలు శిక్షతో పాటు 216 కోట్ల రూపాయల జరిమానా విధించారు. దీంతో షకీరా న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. కోర్టు(Court) విచారణలో భాగంగా ఆమె అధికారులతో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు.
పాప్‌స్టార్ షకీరా(Shakira) తన జైలు శిక్షను తగ్గించుకున్నారు. అందుకోస ఆమె అధికారులతో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇంతకీ ఆమెకు జైలు శిక్ష(Imprisonment) ఎందుకు పడిందో, ఆ శిక్షను ఎలా తగ్గించుకున్నారో ఇప్పుడు తెలుసుకుందాం! 2012-2014 మధ్య కాలంలో స్పెయిన్(Spain) ప్రభుత్వానికి 131 కోట్ల రూపాయల పన్ను(Tax) చెల్లించలేదనే ఆరోపణలు షకీరాపై వచ్చాయి. దాంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని ప్రాథమిక విచారణ జరిపించారు. విచారణ తర్వాత షకీరాకు ఎనిమిదేళ్ల రెండు నెలల జైలు శిక్షతో పాటు 216 కోట్ల రూపాయల జరిమానా విధించారు. దీంతో షకీరా న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. కోర్టు(Court) విచారణలో భాగంగా ఆమె అధికారులతో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. ప్రభుత్వానికి పన్ను చెల్లించకపోవడం నిజమేనని ఒప్పుకుంటూ జైలు శిక్ష తగ్గించాల్సిందిగా విన్నవించుకున్నారు. మూడేళ్ల జైలుశిక్ష, 6.3 కోట్ల రూపాయల జరిమానా చెల్లించేలా అధికారులతో ఆమె ఒప్పందం కుదుర్చుకున్నారు. తన కెరీర్, పిల్లల భవిష్యత్తును ఆలోచించే షకీరా ఈ కఠిన నిర్ణయం తీసుకున్నారని కోర్టులో ఆమె తరపున వాదించిన మిరియం కంపెనీ తెలిపింది. షకీరా తరపున వాదించడానికి అన్ని అంశాలను సిద్ధం చేసుకున్నామని, కాకపోతే ఆమె అమాయకురాలు కాబట్టి అధికారులతో ఒప్పందం చేసుకున్నారని మిరియం కంపెనీ పేర్కొంది. 2012-2014 వరకు తను బహమాస్‌లోనే ఉన్నానని, పన్ను ప్రయోజనాల కోసం తనను స్పానిష్ నివాసిగా పరిగణించకూడదని షకీరా అభ్యర్థించినప్పటికీ స్పానిష్ ప్రభుత్వం అంగీకరించలేదు. అందుకు కారణం షకీరా 2012లో 242 రోజులు, 2013లో 212 రోజులు, 2014లో 243 రోజులు స్పెయిన్‌లోనే ఉన్నారు. ఇందుకు రుజువులు కూడా ఉన్నాయి. స్పెయిన్ చట్టంలోని నియమాల ప్రకారం 183 రోజుల కంటే ఎక్కువ కాలంలో దేశంలో ఉంటే వారు తమ ఆదాయాలను ప్రభుత్వానికి ప్రకటించాలి. ఆదాయానికి తగిన పన్ను చెల్లించాలి. షకీరా చాలాకాలం స్పెయిన్‌లో ఉన్నారని, తన ఆదాయ వివరాలను ప్రభుత్వానికి తెలపలేదని అధికారులు స్పష్టం చేశారు.