మాజీ మంత్రి దాడి వీరభద్రరావు వైసీపీకి రాజీనామా చేశారు. తన అనుచరులతో కలిసి పార్టీ వీడుతున్నట్లు ఏక వ్యాఖ్యంతో కూడిన రాజీనామా లేఖను సీఎం జగన్‌కు పంపించారు. రాజీనామా కాపీని పార్టీ పెద్దలు సజ్జల, విజయసారెడ్డికి పంపిన వీరభద్రరావు..రిజనల్ కోఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి పేరును మాత్రం ఎక్కడా ప్రస్తావించలేదు. త్వరలోనే దాడి వీరభద్రరావు జనసేనలో చేరనున్నట్టు తెలుస్తోంది.
మాజీ మంత్రి దాడి వీరభద్రరావు వైసీపీకి రాజీనామా చేశారు. తన అనుచరులతో కలిసి పార్టీ వీడుతున్నట్లు ఏక వ్యాఖ్యంతో కూడిన రాజీనామా లేఖను సీఎం జగన్(cm jagan)కు పంపించారు. రాజీనామా కాపీని పార్టీ పెద్దలు సజ్జల(sajjala), విజయసారెడ్డి(vijayasaireddy)కి పంపిన వీరభద్రరావు..రిజనల్ కోఆర్డినేటర్(Regional Coordinator) వైవీ సుబ్బారెడ్డి(YV Subbareddy)పేరును మాత్రం ఎక్కడా ప్రస్తావించలేదు. త్వరలోనే దాడి వీరభద్రరావు జనసేనలో చేరనున్నట్టు తెలుస్తోంది.
ఎన్నికలకు ముందే నేతల రాజీనామా వ్యవహారం వైసీపీలో కలకలం రేపుతోంది. ఇప్పటికే తన అభ్యర్థిత్వాన్ని మార్చారని ఒకరు, టికెట్ ఇచ్చేందుకు నిరాకరించారని మరొకరు రాజీనామా చేయగా.. తాజాగా మాజీ మంత్రి దాడి వీరభద్రరావు(Ex minister Dadi Veerabhadra Rao) పార్టీకి గుడ్‌బై చెప్పారు. తన అనుచరులతో కలిసి పార్టీ వీడుతున్నట్టు రాజీనామా లేఖలో ప్రకటించారు. ప్రస్తుతం వైసీపీలో టిక్కెట్ల కసరత్తు జరుగుతోంది. తనకు లేదా తన కుమారుడికి టిక్కెట్ కేటాయించాలని ఆయన కోరుతున్నారు. ఏ స్థానానికి కూడా దాడి కుటుంబం నుంచి ఓ పేరును పరిశీలించడం లేదు. దీంతో తీవ్ర అసంతృప్తికి గురైన ఆయన..చివరికి రాజీనామా చేశారు. అయితే గత కొంత కాలంగా జనసేన వర్గాలతో ఆయన సంప్రదింపులు జరిపిన దాడి వీరభద్రరావు..త్వరలోనే జనసేనలో చేరే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది.
2014 ఎన్నికలకు ముందు దాడి వీరభద్రరావు వైసీపీలో చేరారు. కానీ పార్టీలో ఆయన సరైన గౌరవం లభించలేదు. అనకాపల్లి ఎమ్మెల్యే సీటును గత ఎన్నికల్లో గుడివాడ అమర్నాథ్(Gudivada amarnath) కు కేటాయించారు జగన్. విశాఖ పశ్చిమ నియోజకవర్గాన్ని(visakhapatnam west constituency) దాడి తనయుడు దాడి రత్నాకర్(Dadi Ratnakar)కు కేటాయించినా..ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు. ఆ తరువాత పార్టీ వారిని పక్కన పెట్టింది. జగన్ తీరుపై అసహనంగా ఉన్నా..దాడి వీరభద్రరావు కూడా కొంతకాలంగా మౌనంగానే ఉన్నారు. అయితే గుడివాడ అమర్నాథ్ తో ఉన్న వైరుధ్యాలు, వైసీపీ అధిష్టానం పట్టించుకోకపోవడం లాంటి కారణాలతో దాడి వీరభద్రరావు వైసీపీకి రాజీనామా చేసినట్టు తెలుస్తోంది. ఆ మధ్య జనసేన(Janaseana) అధినేత పవన్ కల్యాణ్(Pavan kalyan) దాడి వీరభద్రరావును నేరుగా కలిశారు. అప్పటినుంచే ఆయన జనసేనలో చేరతారని ప్రచారం సాగింది.
1985లో మొదటిసారి ఎన్టీఆర్(ntr) పిలుపు అందుకుని దాడి వీరభద్రరావు రాజకీయ అరంగేట్రం చేసి అనకాపల్లి నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత 1989, 1994, 1999లలో వరసగా గెలిచారు. అలా నాలుగు సార్లు గెలిచి పలు కీలక శాఖలకు మంత్రిగా ఉన్నారు. 2007 నుంచి 2012 దాకా ఎమ్మెల్సీగా కూడా పనిచేశారు. అనకాపల్లి(anakaplle) రాజకీయాలను శాసించారు.