హైదరాబాద్ (Hyderabad)హబ్సిగూడలోని రవీంద్రనగర్‌లో విషాద ఛాయలు నెలకొన్నాయి. స్కూల్ బస్సు కింద పడి రెండేళ్ల చిన్నపాప మృతి చెందింది. దీంతో కుటుంబసభ్యులు(Family members) కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. తన సోదరుడిని స్కూల్ బస్సు(School bus) ఎక్కించేందుకు వెళ్తున్న తండ్రి, అమ్మమ్మతో కలిసి చిన్నారి జావ్లానా కూడా రోడ్డుమీదికి వచ్చింది.

school bus
హైదరాబాద్ (Hyderabad)హబ్సిగూడలోని రవీంద్రనగర్‌లో విషాద ఛాయలు నెలకొన్నాయి. స్కూల్ బస్సు కింద పడి రెండేళ్ల చిన్నపాప మృతి చెందింది. దీంతో కుటుంబసభ్యులు(Family members) కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. తన సోదరుడిని స్కూల్ బస్సు(School bus) ఎక్కించేందుకు వెళ్తున్న తండ్రి, అమ్మమ్మతో కలిసి చిన్నారి జావ్లానా కూడా రోడ్డుమీదికి వచ్చింది. అమ్మమ్మతో ఉన్న చిన్నారి.. డ్రైవర్‌తో(Driver) మాట్లాడుతున్న తండ్రి మిథున్ దగ్గరికి వెళ్లేందుకు ప్రయత్నించింది. ఒక్క సారిగా అమ్మమ్మను(Grandmother) వదిలించుకొని మిథున్ దగ్గరకు వెళ్లే క్రమంలో బస్సును డ్రైవర్ ముందుకు తోలడంతో బస్సు కింద పడి చిన్నారి మృతి చెందింది. చిన్నారి మృతికి డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని కుటుంబసభ్యులు రోదిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి(Gandhi Hospital) తరలించారు. ఘటనపై ఓయూ పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు.
