వందేళ్ల నుంచి అల్లుళ్లకు వారు పాములనే కట్నంగా ఇస్తూ వస్తున్నారు. అల్లుళ్లు కూడా మరో మాట మాట్లాడకుండా మామగారు ఇచ్చిన పాములను భద్రంగా పుచ్చుకుంటున్నారు. పెళ్లి సమయంలో వధువు(Bride) తరఫు నుంచి వరుడికి తొమ్మిది రకాల జాతులకు చెందిన పాములను కట్నంగా ఇచ్చుకుంటున్నారు. కట్నంగా పాములను ఇవ్వలేని అమ్మాయిలను అక్కడ ఎవరూ పెళ్లిచేసుకోరట!

కట్నం(Dowry) ఇవ్వడం, పుచ్చుకోవడం రెండూ నేరమే! చట్టరిత్యా నేరమని తెలిసినా వరకట్నం అనే జాడ్యం సమాజాన్ని ఇంకా అంటిపెట్టుకునే ఉంది. అల్లుడికి తమ తాహతుకు తగినట్టుగా కట్నం ఇస్తుంటారు వధువు తల్లిదండ్రులు. డబ్బో దస్కమో, బంగారమో , పొలమో, ఇల్లో ఇంటి జాగాలో ఇస్తుంటారు. కానీ ఆడపిల్లల తల్లిదండ్రులు అల్లుడికి కట్నంగా పాములను ఇవ్వడాన్ని ఎప్పుడైనా విన్నారా? ఛత్తీస్‌గఢ్‌లోని కొర్బా ప్రాంతంలో ఈ ఆచారం ఇప్పటికీ ఉందట! అక్కడ సన్వారా అనే గిరిజన తెగ ఉంది.

వందేళ్ల నుంచి అల్లుళ్లకు వారు పాములనే కట్నంగా ఇస్తూ వస్తున్నారు. అల్లుళ్లు కూడా మరో మాట మాట్లాడకుండా మామగారు ఇచ్చిన పాములను భద్రంగా పుచ్చుకుంటున్నారు. పెళ్లి సమయంలో వధువు(Bride) తరఫు నుంచి వరుడికి తొమ్మిది రకాల జాతులకు చెందిన పాములను కట్నంగా ఇచ్చుకుంటున్నారు. కట్నంగా పాములను ఇవ్వలేని అమ్మాయిలను అక్కడ ఎవరూ పెళ్లిచేసుకోరట! ఇప్పుడంటే తొమ్మిది రకాల జాతులకు చెందిన 21 సర్పాలను కట్నంగా ఇస్తున్నారు కానీ మా కాలంలో అయితే 60 పాములను(Snakes) ఇచ్చే వారు తెలుసా? అని గర్వంగా చెబుతుంటారు అక్కడి పెద్దలు. ఇప్పుడు 21 పాములే ఇవ్వడానికి కారణం వాటి సంఖ్య తగ్గిపోవడమే. సన్వారా తెగ వారికి పాములను ఆడించడమే జీవనాధారం. అందుకే వరకట్నంగా పాములను ఇస్తుంటారు.

వివాహ సమయంలో మెట్టినింటికి తొమ్మిది జాతుల పాములను తీసుకురాలేకపోతే మాత్రం ఆ పెళ్లి అసంపూర్ణంగా మిగిలిపోయినట్టేనని సన్వారా గిరిజనులు(Sanvara Tribes) భావిస్తారు. కూతురు పెళ్లి నిశ్చయమైన తర్వాత తండ్రి పాములు పట్టడం మొదలుపెడతాడు. ఒకప్పుడు విషపూరిత పాములను కూడా కట్నంగా ఇచ్చుకునేవారు. ప్రజల ప్రాణాలను కాపాడటం ప్రభుత్వం విధి కాబట్టి విషరహిత పాములను మాత్రమే పట్టుకునేందుకు గిరిజనులకు అనుమతినిస్తోంది. సన్వారా తెగవారి ఆచార, సంప్రదాయాలను గౌరవించి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఒకవేళ సంప్రదాయాన్ని అనుసరిస్తూ కొత్త అల్లుడు 21 విష సర్పాలనే కట్నంగా పుచ్చుకున్నాడనుకుందాం! వాటిని రెండు నెలల పాటు తన దగ్గర పెట్టుకుని, వాటిని పూజలు చేసి తిరిగి అడవిలో వదిలేస్తున్నారు.

Updated On 22 July 2023 3:04 AM GMT
Ehatv

Ehatv

Next Story