మహిళలకు ప్రభుత్వం మరో శుభవార్త తెలిపింది. ఈ నెల 7 నుంచి 15 వరకు సంక్రాంతి పండుగ సందర్భంగా 4,484 ప్రత్యేక బస్సులు నడపనున్నట్టు ప్రకటించింది. ఈ స్పెషల్ బస్సుల్లోనూ మహిళకు ఉచిత ప్రయాణం ఉంటుందని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ వెల్లడించారు. వీటిలో 626 బస్సులకు అడ్వాన్స్ రిజర్వేషన్ సౌకర్యం కల్పిస్తున్నట్టు చెప్పారు. అయితే సంక్రాంతి ప్రత్యేక బస్సులను సాధారణ ఛార్జీలతోనే నడపనున్నట్లు ప్రకటించారు.

మహిళలకు ప్రభుత్వం మరో శుభవార్త తెలిపింది. ఈ నెల 7 నుంచి 15 వరకు సంక్రాంతి పండుగ(Sankranti festival) సందర్భంగా 4,484 ప్రత్యేక బస్సులు(Special buses)నడపనున్నట్టు ప్రకటించింది. ఈ స్పెషల్ బస్సుల్లోనూ మహిళకు ఉచిత ప్రయాణం ఉంటుందని ఆర్టీసీ ఎండీ సజ్జనార్(RTC MD Sajjanar) వెల్లడించారు. వీటిలో 626 బస్సులకు అడ్వాన్స్ రిజర్వేషన్ సౌకర్యం కల్పిస్తున్నట్టు చెప్పారు. శుక్రవారం బస్ భవన్(Bus Bhawan)‎లో సంక్రాంతి సర్వీసులు(Sankranti services), మహాలక్ష్మి స్కీం(Mahalakshmi Scheme)పై ఈడీలు, ఆర్ఎంలతో ఎండీ సజ్జనార్ సమీక్ష సమావేశం నిర్వహించారు. అయితే సంక్రాంతి ప్రత్యేక బస్సుల(Sankranti special buses)ను సాధారణ ఛార్జీలతోనే నడపనున్నట్లు తెలిపారు. సంక్రాంతికి నడిపే స్పెషల్ బస్సుల్లో పల్లె వెలుగు, ఎక్స్ ప్రెస్, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ ప్రెస్ బస్సుల్లోనూ మహిళలకు ఉచిత బస్సు సదుపాయం అమల్లో ఉంటుందని స్పష్టం చేశారు. ఇక హైదరాబాద్‎లో రద్దీ ప్రాంతాలైన ఎంజీబీఎస్‌‌‌‌, జేబీఎస్‌‌‌‌, ఉప్పల్‌‌‌‌ క్రాస్‌‌‌‌ రోడ్స్‌‌‌‌, ఆరాంఘర్‌‌‌‌, ఎల్బీనగర్‌‌‌‌ క్రాస్‌‌‌‌ రోడ్స్‌‌‌‌, కేపీహెచ్‌‌‌‌బీ, బోయిన్‌‌‌‌పల్లి, గచ్చిబౌలి తదితర ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులు ఉంటాయని, రద్దీ ప్రాంతాల్లో ప్రతిచోట ఇద్దరు డీవీఎం అధికారులు..ఎప్పటికప్పుడు బస్సులను మానిటర్ చేస్తారని చెప్పారు. ఏపీలోని వివిధ ప్రాంతాలకు ప్రత్యేక బస్సులు నడపడంతోపాటు షెడ్యూల్ సర్వీసులు యథావిధిగా ఉంటాయని అన్నారు ఎండీ సజ్జనార్.

ఇక గతేడాది సంక్రాంతి సందర్భంగా నడిపిన ప్రత్యేక బస్సుల సంఖ్య కంటే దాదాపు 200 అదనం. కానీ, తెలంగాణ నుంచి ఏపీలోని వివిధ ప్రాంతాలకు 1,500 ప్రత్యేక బస్సులు అవసరమని గుర్తించినప్పటికీ, కేవలం 600 సర్వీసులను మాత్రమే తిప్పేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ వసతి ఉండటంతో బస్సులో విపరీతమైన రద్దీ పెరిగిన విషయం తెలిసిందే. దీంతో ఉన్న బస్సులు సరిపోవటం లేదు. ఇప్పటికిప్పుడు కొత్త బస్సులు అందే అవకాశం లేకపోవటంతో పండగ ప్రత్యేక బస్సుల్లో సింహభాగం తెలంగాణ ప్రాంతంలోనే నడపాలని ఆర్టీసీ నిర్ణయించింది.

Updated On 5 Jan 2024 11:13 PM GMT
Ehatv

Ehatv

Next Story