హైదరాబాద్ నగరంలో గ‌త కొన్ని రోజులుగా కురుస్తున్న‌ భారీ వర్షాలతో వరద, మురుగు నీరు ఇళ్లలోకి వస్తోంది. ఈ క్ర‌మంలోనే అల్వాల్(Alwal) ప్రాంతంలో ఓ ఇంట్లోకి పాము(snake) రావడంతో అందులో ఉండే వ్య‌క్తులు భ‌యాందోళ‌న‌ల‌కు గుర‌య్యారు. వెంట‌నే జీహెచ్ఎంసీ(GHMC) అధికారులకు ఫిర్యాదు చేశారు.

హైదరాబాద్ నగరంలో గ‌త కొన్ని రోజులుగా కురుస్తున్న‌ భారీ వర్షాలతో వరద, మురుగు నీరు ఇళ్లలోకి వస్తోంది. ఈ క్ర‌మంలోనే అల్వాల్(Alwal) ప్రాంతంలో ఓ ఇంట్లోకి పాము(snake) రావడంతో అందులో ఉండే వ్య‌క్తులు భ‌యాందోళ‌న‌ల‌కు గుర‌య్యారు. వెంట‌నే జీహెచ్ఎంసీ(GHMC) అధికారులకు ఫిర్యాదు చేశారు. అయితే.. ఫిర్యాదు చేసి 6 గంటలు గడిచినా జీహెచ్ఎంసీ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దీంతో ఓపిక నశించి సంపత్ కుమార్(Sampath Kummar) అనే యువకుడు అల్వాల్ జీహెచ్ెంసీ వార్డు ఆఫీసుకు పామును తీసుకుని వెళ్లాడు. టేబుల్‌పై పామును వ‌దిలి నిరసన వ్య‌క్తం చేశాడు.

Updated On 26 July 2023 2:51 AM GMT
Ehatv

Ehatv

Next Story