Samoa Birthday Law : భార్య బర్త్‌డేను మర్చిపోయారా? అంతే సంగతులు!
ఇక్కడంటే భార్య పుట్టిన రోజును భర్త మర్చిపోయినా చెల్లుతుంది కానీ సమోవా(Samoa) దేశంలో మాత్రం అలా కాదు.. పొరపాటునో గ్రహపాటులో భార్య బర్త్‌డేను(Wife birthday) మర్చిపోయారే అనుకుందాం! ఆ భర్తను తీసుకెళ్లి జైల్లో(Jail) తోస్తారు.
ఇక్కడంటే భార్య పుట్టిన రోజును భర్త మర్చిపోయినా చెల్లుతుంది కానీ సమోవా(Samoa) దేశంలో మాత్రం అలా కాదు.. పొరపాటునో గ్రహపాటులో భార్య బర్త్‌డేను(Wife birthday) మర్చిపోయారే అనుకుందాం! ఆ భర్తను తీసుకెళ్లి జైల్లో(Jail) తోస్తారు. అలా కటకటాల వెనకాల నెట్టేది ప్రభుత్వమే. ఆ దేశంలో అలాంటి చట్టాలు అమలవుతున్నాయి మరి! భార్య పుట్టిన రోజును మొదటిసారి మర్చిపోయే భర్తను హెచ్చరించి వదిలిపెడతారు. రెండోసారి కూడా మర్చిపోయాడనుకోండి.. ఆ భర్తకు ఫైన్‌తో(Fine) పాటు అయిదేళ్ల జైలు శిక్ష విధిస్తారు. ఇలా మతిమరపు మొగుళ్లను గుర్తించడానికి ప్రత్యేకంగా ఓ పోలీసు బృందమే ఉందక్కడ! ఈ చట్టం గురించి మహిళలకు అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.