రెండేళ్లకోసారి వచ్చే ఆ నాలుగు రోజులు మేడారం పరిసరాలను మహానగరంగా మార్చేస్తాయి. జనపూనకాలతో వనస్థలిని ఊపేస్తాయి. సుమారు కోటిమందిని తల్లుల చెంతకు చేరుస్తాయి. గూడెపు గుండెభాష వినిపిస్తూ ఆదివాసీ ఆంతర్లోకాన్నీ ప్రపంచానికి పట్టి చూపుతాయి. దండకారణ్య ద్వారాన్ని జనారణ్యం చేస్తాయి. తెలంగాణలోని అన్ని జాతరలోలాగానే ఇక్కడ కూడా సామూహికతే అసలు లక్షణం. వాస్తవానికి మేడారం ఓ కుగ్రామం. కనీసం గ్రామ పంచాయతీ కూడా కాదు. ఊరట్టం గ్రామపంచాయతీలో అది అంతర్భాగం.కానీ, జాతర జరిగే నాలుగు రోజులూ ప్రతి చెట్టూ గుట్టా ఉసిళ్లపుట్టల్లా జనమే జనం. మేడారం మోడ్రన్‌హబ్‌గా మారిపోతుంది. ఎడ్లబండ్ల నుంచి హెలికాప్టర్ల దాక అన్నీ అక్కడ కనిపిస్తాయి.

రెండేళ్లకోసారి వచ్చే ఆ నాలుగు రోజులు మేడారం పరిసరాలను మహానగరంగా మార్చేస్తాయి. జనపూనకాలతో వనస్థలిని ఊపేస్తాయి. సుమారు కోటిమందిని తల్లుల చెంతకు చేరుస్తాయి. గూడెపు గుండెభాష వినిపిస్తూ ఆదివాసీ ఆంతర్లోకాన్నీ ప్రపంచానికి పట్టి చూపుతాయి. దండకారణ్య ద్వారాన్ని జనారణ్యం చేస్తాయి. తెలంగాణలోని అన్ని జాతరలోలాగానే ఇక్కడ కూడా సామూహికతే అసలు లక్షణం. వాస్తవానికి మేడారం ఓ కుగ్రామం. కనీసం గ్రామ పంచాయతీ కూడా కాదు. ఊరట్టం గ్రామపంచాయతీలో అది అంతర్భాగం.కానీ, జాతర జరిగే నాలుగు రోజులూ ప్రతి చెట్టూ గుట్టా ఉసిళ్లపుట్టల్లా జనమే జనం. మేడారం మోడ్రన్‌హబ్‌గా మారిపోతుంది. ఎడ్లబండ్ల నుంచి హెలికాప్టర్ల దాక అన్నీ అక్కడ కనిపిస్తాయి. ల్యాప్‌టాప్‌లు, డిజిటల్ స్క్రీన్లు, ఇగ్లూస్, భుటానీస్ ఇలా అధునాతన సౌకర్యాలన్నీ వచ్చి చేరుతాయి. అత్యాధునిక వాహనాలను అక్కడ చూడొచ్చు. మొబైల్ కవరేజ్‌తోపాటు త్రీజీ సేవలూ అందుబాటులోకి వస్తాయి. అయితే అవన్నీ ఆ నాలుగు రోజులే. జాతర ముగియగానే మేడారం తనలోకి తానే ముడుచుకుపోతుంది. మళ్లీ కారడవిలో కుగ్రామమైపోతుంది.

సమ్మక్క జాతర ప్రధాన వేదిక మేడారమే అయినా వరంగల్(Warangal), కరీంనగర్(Karimnagar), ఆదిలాబాద్(Adilabad), ఖమ్మం(Khammam) జిల్లాల్లోని పలు ప్రాంతాల్లోనూ ఈ జాతరను జరుపుకుంటారు. అయితే, ప్రధాన జాతర సమయంలోనే ఈ ఉపజాతరలు జరుగుతుంటాయి. ఇవన్నీ ఆదివాసీయేతర ప్రాంతాల్లోనే జరుగుతుండడం గమనార్హం. వరంగల్ జిల్లా అగ్రంపహాడ్‌లో అంగరంగ వైభవంగా సమ్మక్క సారలమ్మల జాతర జరుగుతుంది. తర్వాత వరంగల్ నగరశివారులోని ఉర్సుగుట్ట వద్ద అమ్మవారిపేటలో సమ్మక్క జాతర కూడా ఘనంగా జరుగుతుంది. 1977 నుంచి జరుగుతున్న ఈ జాతరకు విశేషంగా భక్తులు తరలివస్తారు.ఇక వరంగల్ జిల్లాలో గుర్రంపేట, మద్దిమేడారం, అమ్మవారిపేట, బొంతగట్టు, రుద్రగూడెం, వెంచరామి, నాగరాజుపల్లి, జోగంపల్లి-పెద్దకొడెపాక, లింగంపల్లి, ఇప్పగూడెం, తాటికొండ, ఫతేపూర్, శ్రీపతిపల్లి, కొండాపూర్, కమలాపూర్, తిరుమలగిరి, కమలాపూర్, గబ్బిలమడుగు, కూటిగల్, కంఠాత్మకూరు, పులిగిల్లి, ధర్మారం, ముల్కలపల్లిల్లో జాతరలు జరుగుతాయి.
కరీంనగర్ జిల్లాలోనూ పలు ప్రాంతాల్లో అనుబంధ జాతరలు జరుగుతాయి. శంకరపట్నం మండలకేంద్రం, చొప్పదండి మండలం గుమ్లాపూర్, రాగంపేట, రామగుండం మండలం గోలివాడ, హుజురాబాద్‌లోని రంగనాయకుల గుట్ట, వీణవంక మండలం పోతిడ్డిపేట, కమలాపురం మండలకేంద్రం, కన్నూరు, ఎల్కతుర్తి మండలకేంవూదాలతోపాటు సుల్తానాబాద్ మండలం నీరుకుళ్ల, పెద్దపల్లి మండలం హన్మంతునిపేట, హుజురాబాద్ మండలం జూపాక గ్రామాల్లో జాతరలు జరుగుతాయి.ఇక సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో గోదావరిఖనిలోని గంగొడ్డున వైభవంగా జాతర జరుగుతుంది. దీని ఆసక్తికర విషయమేంటంటే సింగరేణి బొగ్గు గనులున్న గోదావరిఖని, రామగుండం, మణుగూరు ప్రాంతాల్లోని కార్మికులు మేడారం జాతర వచ్చిందంటే పది పదిహేను రోజులు సెలవులు పెట్టి వెళ్లేవారు. సిబ్బంది కొరతతో సుమారు నాలుగు నుంచి పది లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తికి నష్టం వాటిల్లుతుండేది. ఈ సమస్య నుంచి గట్టెక్కడానికి సింగరేణిలోనే సమ్మక్క సారలమ్మ జాతర నిర్వహించాలని యాజమాన్యం నిర్ణయించింది. 1998 నుంచి సింగరేణి సంస్థ ప్రత్యేక బడ్జెట్ కేటాయించి మరీ ఈ జాతరను నిర్వహిస్తోంది.ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాలలోని గోదావరి ఒడ్డున, సీసీసీలో, రెబ్బన మండలం గంగాపూర్, దేవులగూడ, బెల్లంపల్లి మండలం చిన్నబుగ్గ, ఖమ్మం జిల్లా మణుగూరులోని తోగ్గూడెం, ఇల్లందులోని సంజయ్‌నగర్, బొజ్జాయిగూడెం, కొత్తగూడెంలలో కూడా సమ్మక్క సారలమ్మ పేరల జాతరలను జరుపుతున్నారు.
మేడారం జాతరలో ప్రతీక్షణం మధురానుభూతిని మిగులుస్తుంది. జాతరకు వచ్చిన భక్తులందరూ తనివితీరా తల్లులనుచూసుకుని మొక్కలు సమర్పించి తిరిగి వెళ్లడం ఓ అందమైన జ్ఞాపకంగా నిలుస్తుంది. ముఖ్యంగా భారతదేశంలో జరిగే అతి పెద్ద గిరిజన జాతర మేడారం కాగా, ఈ జాతరకు అనుబంధంగా ఉన్న జాతరలు, జాతరలో జరిగే వ్యాపారం, ఇతరత్రా విశేషాలు మరెక్కడా కనిపించవు. అందుకే మేడారం రెండేళ్లకోసారి వచ్చినా.. ప్రతీ మదిని తట్టి లేపుతుంది. ప్రతీ ఒక్కరిలో జానపద ఆచారాన్ని ప్రతిబింబిస్తుంది.

Updated On 17 Feb 2024 6:55 AM GMT
Ehatv

Ehatv

Next Story