Sajjala : మన రాష్ట్రంతో చంద్రబాబు, లోకేశ్, పవన్‌కళ్యాణ్‌కు ఏమాత్రం సంబంధం లేదు : సజ్జల
ఆంధ్రప్రదేశ్‌తో(Andhra Pradesh) అసలు సంబంధంలేని వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు అని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి(Sajjala Ramakrishna reddy) అన్నారు. ఏపీ సచివాలయం మీడియా పాయింట్ వద్ద ఆయన మీడియాతో మాట్ఆడుతూ.. చంద్రబాబు ఏపీకి గెస్ట్‌లాగా వస్తాడు. గెస్టులాగానే (Guest)పోవాలి తప్ప ఇక్కడ రాజకీయాలతో ఆయనకేం సంబంధమని ప్రశ్నించారు. గడచిన నాలుగున్నరేళ్లల్లో చాలా పెద్దఎత్తున రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతోంటే.. ఆయన మాత్రం 300 రోజులు తెలంగాణలో(Telangana) ఉండి ఇక్కడకు గెస్టు మాదిరిగా వస్తూ జరిగే అభివృద్ధిపై ఏదొక అభూతకల్పనల్ని సృష్టించి ప్రభుత్వంపై బురదజల్లుతాడా..? ఆయన ఏదైతే విషప్రచారాన్ని అల్లి మాట్లాడుతున్నాడో.. ఆ విషప్రవాహంలోనే కొట్టుకుపోతున్నాడని నిన్నటి ప్రెస్‌మీట్‌తో తెలిసిపోయిందని అన్నారు.

తెలంగాణలో తమ ఆస్తుల్ని కాపాడుకునేందుకు చంద్రబాబు(Chandra babu) ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని పట్టించుకోకుండా గాలికొదిలేశాడని అన్నారు. కనుక ఆయనకు, ఆయన కొడుకు లోకేశ్‌కు(Nara Lokesh), దత్తపుత్రుడు పవన్‌కళ్యాణ్‌కు(Pawan Kalyan) మన రాష్ట్రంతో ఏమాత్రం సంబంధంలేదు. జగన్‌ను ప్రజలు వద్దంటున్నారని అతనెలా చెబుతాడు..? గతంలో ఆయన హయాంలో విజయవాడ(Vijayawada) దుర్గమ్మ గుడిలో తాంత్రికపూజలు చేయించినట్లు, ఇప్పుడు కూడా ఎక్కడైనా చేతబడుల్లాంటి తాంత్రికపూజలు చేయిస్తున్నాడేమో.. వాటిమీద నమ్మకంతోనే ఇలా మాట్లాడుతున్నాడేమో చూడాలన్నారు. ఆయనెంత కుట్రలు చేసినా జగన్‌ని(Jagan), మా ప్రభుత్వాన్ని ఏం పీకలేడని తెలుసుకోవాలన్నారు.
ఉద్దానంలో కిడ్నీ(Kidney) వ్యాధుల ప్రభావంతో వేల మంది చనిపోయారని అన్నారు. ఆ గ్రామంలో పెళ్ళి చేసుకోవాలంటే గతంలో పిల్లనిచ్చే పరిస్థితి లేదు.. అంత భయానకంగా ఉన్న పరిస్థితికి ఈరోజు కిడ్నీ రీసెర్చీ సెంటర్ ఏర్పాటుతో సీఎం జగన్ శాశ్వత పరిష్కారం చూపారని. 2014–19లో అధికారంలో ఉన్న చంద్రబాబు ఉద్దానంకు(Uddanam) ఏమీ చేయలేదన్నారు. చంద్రబాబు దత్తపుత్రుడు పవన్‌కళ్యాణ్ కూడా గతంలో ఉద్దానం ప్రాంతంపై పెద్దపెద్ద కోతలు కోశాడు. ప్రత్యేక హెల్త్ క్యాంపులు(Health camps) పెట్టిస్తానన్నాడు. చివరికి ఏమీ చేయకుండా చేతులెత్తేశాడని ఎద్దేవా చేశారు. ఇప్పుడు దాదాపు రూ.800 కోట్లు ఖర్చుపెట్టి జగన్ ఉద్దానంలో కిడ్నీ రీసెర్చి సెంటర్‌తో పాటు మంచినీటి శుద్ధి ప్లాంట్(Water plant) ప్రాజెక్టును శరవేగంగా పూర్తిచేసి ప్రారంభిస్తే.. చంద్రబాబు, పవన్‌కళ్యాణ్‌కు నోటమాట రావడంలేదన్నారు.