రైతుబంధు(Rythu bandhu) నిధులు 'మీకు పడ్డయా.. మీకు పడ్డయా'..? తెలంగాణలో ఇప్పుడు రైతుల(Farmer) మధ్య ఇదే చర్చకొనసాగుతోందని సామాజిక మాధ్యమాల్లో చర్చలు చేస్తున్నారు. రైతుబంధు నిధులు జమచేస్తున్నామని నెలరోజులుగా ప్రభుత్వం ఊరిస్తోంది. దీంతో గత నెలరోజుల పాటు రైతులు తమ ఫోన్లకు టింగ్‌టింగ్‌న మెస్సేజ్‌ ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్నారు. దాదాపు 40 శాతం మంది రైతులకు నిధులు జమచేశామని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ రైతుబంధు నిధులు రాలేదని రైతులు వాపోతున్నారు.

రైతుబంధు(Rythu bandhu) నిధులు 'మీకు పడ్డయా.. మీకు పడ్డయా'..? తెలంగాణలో ఇప్పుడు రైతుల(Farmer) మధ్య ఇదే చర్చకొనసాగుతోందని సామాజిక మాధ్యమాల్లో చర్చలు చేస్తున్నారు. రైతుబంధు నిధులు జమచేస్తున్నామని నెలరోజులుగా ప్రభుత్వం ఊరిస్తోంది. దీంతో గత నెలరోజుల పాటు రైతులు తమ ఫోన్లకు టింగ్‌టింగ్‌న మెస్సేజ్‌ ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్నారు. దాదాపు 40 శాతం మంది రైతులకు నిధులు జమచేశామని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ రైతుబంధు నిధులు రాలేదని రైతులు వాపోతున్నారు. ఈ క్రమంలో సోషల్‌ మీడియాలో(Social media) ఓ చర్చ అయితే నడుస్తోంది.
కేసీఆర్‌(KCR) హయంలో 'మాకు పడ్డయి.. మాకు పడ్డయి..' అని ఫోన్లు చేసుకునేవారట. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు పడ్డాయా.. మీకు పడ్డాయా అని తోటి రైతులను ప్రజలు అడుగుతున్నారట. గంటకోసారి జేబులో ఉన్న ఫోన్ తీసి.. టింగ్‌మన్న శబ్దం వచ్చిందా.. ఒక వేళ ఆ శబ్దాన్ని తాను వినలేదేమోనని.. ఇన్‌బాక్స్‌ ఓపెన్‌ చేసి చెక్‌ చేసుకుంటున్నారట. టింగ్ మన్న శబ్దం, మెసేజ్ రొండూ రాకపోవడంతో దీనంగా మళ్లీ ఆ ఫోన్‌ను అంగి జేబులో పెట్టుకొని.. రెండు చేతులు ప్యాంట్‌ జేబులో పెట్టుకొని ఆకాశంవైపు రైతులు చూస్తున్నారట. రైతుబంధుపై చర్చ సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌ అవుతోంది.

Updated On 8 Jan 2024 8:49 AM GMT
Ehatv

Ehatv

Next Story