టీటీడీ చైర్మన్‌గా నియమితులైన తర్వాత బీఆర్‌నాయుడు వరుసగా నేతలను కలుస్తున్నారు.

టీటీడీ చైర్మన్‌గా నియమితులైన తర్వాత బీఆర్‌నాయుడు వరుసగా నేతలను కలుస్తున్నారు. సీఎం చంద్రబాబును టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడును కలిసి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేశ్‌లను కలిసి శ్రీవారి ప్రసాదాన్ని అందజేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకి, అధికారులకు నూతన బోర్డు తరుపున ధన్యవాదాలు తెలిపారు. 'శ్రీవారి ఆలయ పవిత్రతను కాపాడుతూ, ప్రతిష్టను పెంచేలా చర్యలు చేపడతాం. భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా వ్యవహరిస్తాం” అని బీఆర్ నాయుడు తెలిపారు. తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును కూడా బీఆర్‌నాయుడు కలిశారు. . శ్రీవారి భక్తులకు ఎలాంటి సమస్యలు రాకుండా చూడాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలను అనుమతించాలని మంత్రి తుమ్మల రిక్వెస్ట్ చేశారు తుమ్మల నాగేశ్వరరావు. అంతేకాకుండా టీవీ9 మాజీ సీఈవో, ఆర్‌టీవీ చైర్మన్‌ రవిప్రకాష్‌ను కూడా బీఆర్‌నాయుడు కలిశారు. టీటీడీ చైర్మన్‌గా నియమితులైన తర్వాత మర్యాదపూర్వకంగా రవిప్రకాష్‌ను బీఆర్‌నాయుడు కలిసినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా టీటీడీ నిర్వహణపై రవిప్రకాష్‌ కూడా పలు సూచనలు చేసినట్లు తెలుస్తోంది.

ehatv

ehatv

Next Story