సంక్రాంతికి ముందు ఏపీ ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఫిబ్రవరి 1 నుంచి జీతంతోపాటే నైట్ అలవెన్స్ ఇచ్చేందుకు ఆర్టీసీ యాజమాన్యం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు ఉద్యోగుల సంఘం ప్రకటించింది. సోమవారం ఆర్టీసీ యాజమాన్యంతో చర్చించగా..ఎండీ బ్రహ్మానందరెడ్డి సానుకూలంగా స్పందించారని ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పలిశెట్టి దామోదరరావు, నరసయ్య తెలిపారు.

Apsrtc employees
సంక్రాంతికి ముందు ఏపీ ప్రభుత్వం(ap govt) ఆర్టీసీ ఉద్యోగుల(Rtc employees)కు గుడ్ న్యూస్ చెప్పింది. ఫిబ్రవరి 1 నుంచి జీతంతోపాటే నైట్ అలవెన్స్(Night Allowance) ఇచ్చేందుకు ఆర్టీసీ యాజమాన్యం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు ఉద్యోగుల సంఘం(RTC Employees Union) ప్రకటించింది. సోమవారం ఆర్టీసీ యాజమాన్యంతో చర్చించగా..ఎండీ బ్రహ్మానందరెడ్డి(MD Brahmananda Reddy) సానుకూలంగా స్పందించారని ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక్షుడు పలిశెట్టి దామోదరరావు(President Palishetti Damodarao), ప్రధాన కార్యదర్శి నరసయ్య(Secretary Narasiah) తెలిపారు. మిగిలిన భత్యాలు బకాయిలతోసహా ఉద్యోగులకు వచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరినట్లు ప్రకటనలో తెలిపారు. ఇప్పటికే జీతాలతో పాటు అలవెన్స్‌లను కలిపి చెల్లిస్తోంది.. జనవరి 1వ తేదీ నుంచి ఈ విధానాన్ని అమలులోకి తీసుకొచ్చింది. నైట్ అవుట్, డే అవుట్, ఓవర్ టైమ్ అలవెన్సులను అప్పటివరకు ఆలస్యంగా చెల్లిస్తూ వస్తోంది ప్రభుత్వం. కానీ ఆర్థిక పరిస్థితుల వల్ల అలవెన్సులు చెల్లింపులు ఆలస్యం అయ్యాయి. అలాగే 2017నాటి పేరివిజన్ బకాయిలు, స్టాఫ్ రిటైర్మెంట్ బెనిఫిట్ స్కీమ్ ట్రస్ట్‌కు చెల్లింపుల మొత్తాలను విడుదల చేయడంలో జాప్యం జరిగింది. ఇటీవలే వాటన్నింటినీ క్లియర్ చేయాలంటూ ప్రభుత్వం ఇదివరకే ఆదేశాలను జారీ చేసింది. తాజాగా నైట్ హాల్ట్ అలవెన్సులను కూడా మంజూరు చేయడానికి ప్రభుత్వం అంగీకరించింది. ఫిబ్రవరి 1వ తేదీన అందే వేతనంలో నైట్ హాల్ట్ అలవెన్సులను కలిపి ఇవ్వాలని నిర్ణయించింది.ప్రభుత్వ నిర్ణయంపై ఆర్టీసీ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు.
