తొమ్మిదో(Nine) అంకెపై ప్రజలకున్న మోజు ఆర్టీఏకు బోల్డన్నీ డబ్బులు తెచ్చిపెడుతున్నది. న్యూమరాలజీని గట్టిగా నమ్మే వారే కాదు, ఫ్యాన్సీ నంబర్‌కోసం తాపత్రయపడేవారు కూడా ఆల్ నైన్స్ నంబర్ కోసం లక్షలకు లక్షలు కుమ్మరిస్తున్నారు. తమ వెహికిల్‌పై 9999 అన్న నంబర్ ఉంటే చాలనుకుంటున్నారు. ఈ నంబర్ కోసం బిడ్డింగ్‌లో(Bidding) హోరాహోరీగా పోటీపడుతున్నారు. ఆల్‌నైన్స్‌కు దొరక్కపోతే మరో ఫ్యాన్సీ నంబర్ కోసం ట్రై చేస్తున్నారు.
తొమ్మిదో(Nine) అంకెపై ప్రజలకున్న మోజు ఆర్టీఏకు బోల్డన్నీ డబ్బులు తెచ్చిపెడుతున్నది. న్యూమరాలజీని గట్టిగా నమ్మే వారే కాదు, ఫ్యాన్సీ నంబర్‌కోసం తాపత్రయపడేవారు కూడా ఆల్ నైన్స్ నంబర్ కోసం లక్షలకు లక్షలు కుమ్మరిస్తున్నారు. తమ వెహికిల్‌పై 9999 అన్న నంబర్ ఉంటే చాలనుకుంటున్నారు. ఈ నంబర్ కోసం బిడ్డింగ్‌లో(Bidding) హోరాహోరీగా పోటీపడుతున్నారు. ఆల్‌నైన్స్‌కు దొరక్కపోతే మరో ఫ్యాన్సీ నంబర్ కోసం ట్రై చేస్తున్నారు. మొత్తంగా ఫ్యాన్సీ నంబర్‌లకు ఇప్పుడు పిచ్చ డిమాండ్! ఆ పిచ్చే రవాణా శాఖకు(Transport Department) భారీ ఆదాయాన్ని తెచ్చిపెడుతున్నది. పుట్టిన రోజు, పెళ్లి రోజు గుర్తుకు తెచ్చే నంబర్లను, లక్కీ నంబర్లను కూడా ఎక్కువ మొత్తం ఇచ్చి కొనుక్కుంటున్నారు. గత తొమ్మిదేళ్లలో ఫ్యాన్సీ నంబర్లతో ఆర్టీఏ ఖజానాకు 387 కోట్ల రూపాయలు జమయ్యాయి. లాస్టియర్ 72 కోట్ల రూపాయలకు పైగా ఫ్యాన్సీ ఆదాయం వచ్చింది. ఇక ఈ ఏడాది ఆగస్టు నాటికే 53.66 కోట్ల రూపాయల ఆదాయం సమకూరింది. ఇందులో ఆన్‌నైన్స్ వాటానే ఎక్కువ. ఫ్యాన్సీ నంబర్ల(Fancy number Plates) చరిత్రలో అత్యధికంగా అమ్ముడయిన నంబర్ కూడా ఇదే! టీఎస్ 09 సిరీస్‌లో 9999 నంబర్ 21.60 లక్షల రూపాయలకు అమ్ముడయ్యింది. ఫ్యాన్సీ నంబర్లను ఆన్‌లైన్ ద్వారా బుకింగ్ చేసుకుంటున్నారు. ఒక నంబర్ కోసం పోటీపడేవాళ్లు ఎంత ఎక్కువగా ఉంటే ఆర్టీయేకు(RTA) అంత ఎక్కువ ఆదాయం వస్తున్నది. ఇంతకు ముందు సంపన్న కుటుంబాలు మాత్రమే ఫాన్సీ నంబర్లను కొనుక్కునేవి. ఇప్పుడు మధ్య తరగతి ప్రజలు కూడా ఫ్యాన్సీ నంబర్ల కోసం పోటీపడుతున్నారు. ఫ్యాన్సీ నంబర్లను దక్కించుకోవడంలో ఖైరతాబాద్ ఆర్టీఓ పరిధిలోని వాహనదారులది ప్రత్యేక పాత్ర. ఎందుకంటే ఈ ప్రాంతంలో బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ వంటి ఖరీదైన ప్రాంతాలు ఉన్నాయి. అందుకే ఖైరతాబాద్ సిరీస్‌కే ఎక్కువ ఆదాయం వస్తున్నది. ఫ్యాన్సీ నంబర్‌పై ఆసక్తి ఉన్నవారు తెలంగాణ ట్రాన్స్‌పోర్టు డిపార్ట్‌మెంట్ వెబ్‌సైటులోకి వెళ్లి కుడివైపు ఉన్న ఆన్‌లైన్ సర్వీసెస్ అనే ఆప్షన్‌ను క్లిక్ చేయాలి. అప్పుడు నంబర్ రిజర్వేషన్ అనే లింక్ వస్తుంది. దానిని ఓపెన్ చేస్తే ఆ రోజు అందుబాటులో ఉన్న నంబర్లు ప్రత్యక్షమవుతాయి. అందులో నచ్చిన నంబర్ కావాలనుకుంటే మాత్రం సంబంధిత నంబర్ పేర్కొంటూ వాహన టీఆర్ నంబరును ఎంటర్ చేయాలి. వివరాలు సమర్పించిన తర్వాత వాహనదారుడు ఎంచుకున్న నంబరుకు డబ్బులు చెల్లంచాలి. నంబర్ రిజర్వేషన్ కోసం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. మధ్యాహ్నం రెండు గంటల నుంచి నాలుగు గంటల వరకు బిడ్ మొత్తాన్ని చెల్లిస్తే సాయంకాలం అయిదు గంటల వరకు నంబరు ఖరారై ప్రింట్ వస్తుంది. ఈ ప్రక్రియలో రిజిస్టర్ మొబైల్ నంబరుకు మెసేజ్ వస్తుంది. ఇందులో ఏమైనా సమస్యలు వస్తే ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు 040 23370081 లేదా 040 23370082 టెలిఫోన్ నంబర్లను సంప్రదించవచ్చు.