కొత్త ఏడాది(New Year) సందర్భంగా తెలంగాణ ప్రభుత్వానికి మద్యం అమ్మకాల ద్వారా భారీ ఆదాయం వచ్చింది. డిసెంబర్‌ 31వ తేదీ ఒక్క రోజునే 19 ప్రభుత్వ డిపోల నుంచి లక్షా 30 వేల కేసుల లిక్కర్‌(Liquor), లక్షా 35 వేల కేసుల బీర్‌(Beer) అమ్మకాలు జరిగాయి. ఆదివారం ఒక్కరోజే ప్రభుత్వానికి 125 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. గడచిన మూడు రోజుల్లో తెలంగాణలో 658 కోట్ల రూపాయల మద్యం అమ్మకాలు(Liquor sales) జరిగాయి.

కొత్త ఏడాది(New Year) సందర్భంగా తెలంగాణ ప్రభుత్వానికి మద్యం అమ్మకాల ద్వారా భారీ ఆదాయం వచ్చింది. డిసెంబర్‌ 31వ తేదీ ఒక్క రోజునే 19 ప్రభుత్వ డిపోల నుంచి లక్షా 30 వేల కేసుల లిక్కర్‌(Liquor), లక్షా 35 వేల కేసుల బీర్‌(Beer) అమ్మకాలు జరిగాయి. ఆదివారం ఒక్కరోజే ప్రభుత్వానికి 125 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. గడచిన మూడు రోజుల్లో తెలంగాణలో 658 కోట్ల రూపాయల మద్యం అమ్మకాలు(Liquor sales) జరిగాయి. ఇదలా ఉంటే, కొత్త సంవత్సరం సందర్భంగా కమిషనరేట్ల పరిధిలో భారీగా డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌(Drunk and drive) కేసులు నమోదయ్యాయి. మందుబాబులను పోలీసులు హెచ్చరించినా వారు పట్టించుకోలేదు. హైదరాబాద్‌(Hyderabad) కమిషనరేట్‌ పరిధిలో 1200 కేసులు, సైబరాబాద్(Cyberabad) కమిషనరేట్‌ పరిధిలో 1,241 కేసులు నమోదయ్యాయి. సైబరాబాద్‌లో బ్రీత్‌ అనలైజర్‌ కౌంట్‌ 200 పాయింట్లు దాటిన వారు 151 మంది ఉన్నారని పోలీసులు తెలిపారు. సైబరాబాద్‌లో ఇద్దరు మహిళలతోపాటు తాగి వాహనాలు నడిపన 1,239 మందిపై పోలీసులు కేసులు పెట్టారు. తాగి డ్రైవింగ్‌ చేసిన కేసుల్లో 938 బైకులు, 21 ఆటోలు, 275 కార్లు, ఏడు భారీ వాహనాలను పోలీసులు(Police) స్వాధీనం చేసుకున్నారు. పలుచోట్ల పోలీసులతో వాహనదారులు వాగ్వాదానికి దిగారు. కాగా, జంటనగరాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు చర్యలు తీసుకున్నారు.

Updated On 1 Jan 2024 2:24 AM GMT
Ehatv

Ehatv

Next Story