సూర్య భగవానుడు రోహిణి నక్షత్రంలో ఉన్న సమయాన్ని రోహిణి కార్తె(Rohini karthe)గా భావిస్తారు . ప్రస్తుతం కృత్తికా నక్షత్రంలో ఉన్న సూర్యుడు ఇవాళ్టి నుంచి అంటే మే 25వ తేదీ నుంచి రోహిణి నక్షత్రంలో సంచరిస్తాడు. ఈ కాలంలో సూర్య దేవుడిని ఆరాధించడం వల్ల ఎండ వేడి నుంచి రక్షణ లభిస్తుంది.
సూర్య భగవానుడు రోహిణి నక్షత్రంలో ఉన్న సమయాన్ని రోహిణి కార్తె(Rohini karthe)గా భావిస్తారు . ప్రస్తుతం కృత్తికా నక్షత్రంలో ఉన్న సూర్యుడు ఇవాళ్టి నుంచి అంటే మే 25వ తేదీ నుంచి రోహిణి నక్షత్రంలో సంచరిస్తాడు. ఈ కాలంలో సూర్య దేవుడిని ఆరాధించడం వల్ల ఎండ వేడి నుంచి రక్షణ లభిస్తుంది. ఎందుకంటే ఈ సమయంలో సూర్యుడి వేడి ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. గత నాలుగు రోజులుగా తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో వాతావరణం కాస్త చల్లబడింది. కానీ రాత్రి వర్షం పడితే పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల వరకూ నమోదవుతూనే ఉన్నాయి. విపరీతమైన ఎండలు, ఉక్కపోతకు ప్రజలు అల్లాడుతున్నారు. ఉగాది నుండి రోజురోజుకూ ఉష్ణోగ్రతలు పెరుగుతూనే వచ్చాయి. గతవారం తెలుగు రాష్ట్రాల్లో.. ముఖ్యంగా ఏపీలో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలను తాకాయి. పలు ప్రాంతాల్లో 46 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు కూడా నమోదయ్యాయి. క రోహిణి కార్తె రానే వచ్చింది. "రోళ్లు బద్దలు కొట్టే రోహిణీకార్తె" సామెత ఊరికే రాలేదు మరి. ఎండాకాలంలో చివరిగా వచ్చే కార్తె. ఇప్పటికే అధిక ఉష్ణోగ్రతలకు ఉక్కిరి బిక్కిరవుతుంటే.. రోహిణి కార్తెలో వచ్చే ఎండలు ఇంకా ఎక్కువగా ఉంటాయి. మే 25న ప్రారంభమయ్యే రోహిణి కార్తె జూన్ 8వ తేదీ ఉదయం 6.41 గంటల వరకు ఉంటుంది. ఈ పక్షం రోజుల్లో ఎండ తీవ్రతకు తోడు వేడి గాలులు (వడగాలులు) పెరుగుతాయి. రోహిణి కార్తె ఫలితంగా ఈ రోజులలో శనిపై కుజని దృష్టి ఉంటుంది. వృషభరాశిలో పౌర్ణమి వరకు బుధ, శుక్ర, రాహువుల కలయికలున్నవి. అంతేకాకుండా రోహిణి కార్తెలో రవి, రాహుల కలయికలు కుడా ఉండుటచేత వడ గాల్పులు తీవ్రమైతవి, మంచి నీటి ఎద్దడి ఏర్పడును. నైరుతి రుతుపవనాలు మాతరం స్వల్ప ఆలస్యమైనా ఫలితాలు మాత్రం అనుకూలంగా ఉంటాయి. ఎండ తీవ్రతకు శరీరం ఇట్టే అలసిపోతుంది కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవాలి. చల్ల, పండ్ల రసాలు, కొబ్బరినీళ్లు, నిమ్మరసం, రాగి జావ వంటివి తీసుకోవాలి.