Change of candidates gain or Loss: అభ్యర్థుల మార్పు-లాభమా..? నష్టమా..? వైసీపీ శ్రేణుల్లో ఆసక్తికర చర్చ !
రాబోయే ఎన్నికలే టార్గెట్గా వైసీపీ ఇంఛార్జీల మార్పుపై సీఎం జగన్ కసరత్తు కొనసాగుతోంది. ఏది ఏమైనా 50 నుంచి 60 చోట్ల ఇంఛార్జీల మార్పు అనివార్యమని వైసీపీ అధిష్టానం భావిస్తోంది. ఇప్పటికే కొంత మంది మంత్రులు, ఎమ్మెల్యేలను మార్చిన సంగతి తెలిసిందే. తాజాగా మరికొందరు మంత్రులు, ఎమ్మెల్యేలను తాడేపల్లికి పలిచి..చర్చించింది. ఈ క్రమంలోనే ఇంఛార్జీల మార్పుపై వైసీపీ రెండో జాబితా(Second List) రేపోమాపో విడుదలకు సిద్ధంగా ఉన్నట్టు సమాచారం. అయితే అభ్యర్థుల మార్పు పార్టీకి నష్టం చేస్తుందా.. లాభం చేకూరుస్తుందా? అనేదానిపై పార్టీ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది.

రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్నకొద్దీ ఏపీ రాజకీయాలు మరింత హీటెక్కాయి. ముఖ్యంగా వైసీపీ అధినేత, సీఎం జగన్(cm jagan) వ్యూహాలు తీవ్ర చర్చకు దారితీశాయి. నియోజకవర్గాల అభ్యర్థుల మార్పులు మరిన్ని ఖాయమనే ప్రచారం జరుగుతుండటంతో అధికార పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రుల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఈ క్రమంలోనే మార్పులు చేసే నియోజకవర్గాలకు సంబంధించిన సిట్టింగ్లకు తాడేపల్లి నుంచి ఫోన్ కాల్స్ వెళ్లాయి. సీఎం నుంచి పిలుపు అందుకున్న వారిలో నెల్లూరు ఎంపీ((Nellore MP) ఆదాల ప్రభాకర్ రెడ్డి(Adala Prabhakar Reddy), చోడవరం ఎమ్మెల్యే(Chodavaram MLA) కరణం ధర్మశ్రీ(Karanam Dharmashree), శ్రీకాళహస్తి ఎమ్మెల్యే (Srikalahasti MLA) బియ్యపు మధుసూదన్ రెడ్డి(Biyapu Madhusudan Reddy), పాయకరావుపేట ఎమ్మెల్యే (Payakaraopet MLA)గొల్లబాబురావు (Golla Bab Rao), పెనుగొండ ఎమ్మెల్యే(Penugonda MLA) శంకర నారాయణ(Sankaranarayana), కదిరి ఎమ్మెల్యే(Kadiri MLA) సిద్ధారెడ్డి (Siddareddy), రాజాం ఎమ్మెల్యే(Rajam MLA) కంబాల జోగులు (Kambala Jogulu) ఉన్నారు. ప్రస్తుతం వీరు పోటీ చేస్తున్న స్థానాలపై ప్రభుత్వ విప్(Govt Whip) సజ్జల(Sajjala Ramakrishna Reddy) చర్చించి, వారి అభిప్రాయలు తీసుకున్నట్టు తెలుస్తోంది. నేతల అభిప్రాయాలను సీఎం జగన్ కు చేరవేస్తారని సమాచారం. అనంతరం వైసీపీ అధినేత, సీఎం జగన్ ఇంఛార్జీల మార్పుపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టు సమాచారం. ఈ నెల 30లోగా మార్చిన ఇంఛార్జీల జాబితా విడుదల చేయనున్నట్టు తెలుస్తోంది. ఈలోగా మరికొంత మందిని పిలిచి మాట్లాడే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
అయితే వైసీపీ అధిష్టానం ఇంఛార్జీల మార్చుతుండటంతో నేతల్లో అసంతృప్తి భగ్గుమంటోంది. ఇప్పటికే మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఎమ్మెల్యే పదవికి, పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఎమ్మెల్యే ఎమ్మెల్యే వంశీకృష్ణ పార్టీని వీడి జనసేనలో చేరారు. బుధవారం తాడపల్లికి పలిచిన మాట్లాడిన ఎమ్మెల్యేల్లో ఎవరికి టికెట్ నిరాకరిస్తారో..ఎవరు రాజీనామా చేస్తారో అన్నది పార్టీ శ్రేణుల్లో ఉత్కంఠంగా మారింది. అయితే అభ్యర్థుల మార్పు లాభమా..నష్టమా? అనేదానిపై పార్టీ వర్గాలు మల్లగుల్లాలుపడుతున్నాయి. ప్రభుత్వ వ్యతిరేకతలో ఎమ్మెల్యేలు, లేదా ఇంఛార్జీల భాగమెంత? నేతలను మార్చినంత మాత్రాన ప్రయోజనం ఉంటుందా? సీట్లు దక్కని నేతలు పార్టీ గెలుపు కోసం పని చేస్తారా? అనే ప్రశ్నలు పార్టీ శ్రేణులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.