కాలిఫోర్నియా(Calfornia) రాష్ట్రంలోని రీడ్లీ సిటీలో దీన్ని గుర్తించారు. చైనాకు చెందిన ఒక బయోటెక్‌ కంపెనీ(Biotech Company) నడుపుతున్న ఆ ల్యాబ్‌లో వందలకొద్దీ ప్రమాదకర వైరస్‌లతో ప్రయోగాలు చేస్తున్నట్టు వెల్లడైంది. ఈ విషయం తెలియడంతో రీడ్లీ సిటీ(Reedley City) ప్రజలు ఉలిక్కిపడ్డారు. ఆ ల్యాబ్‌లో కరోనా వైరస్‌, మలేరియా వైరస్‌, హెచ్‌ఐవీ వైరస్‌, హెపటైటిస్‌ వైరస్‌, స్పృహలేని స్థితిలో 1000 ఎలుకలు, 200 చనిపోయిన ఎలుకలు ఉన్నట్టు దర్యాప్తులో తేలింది.

అగ్రరాజ్యం అమెరికా(America) చైనా(China) మధ్య పచ్చ గడ్డి వేస్తె భగ్గుమంటుంది. రెండు దేశాల మధ్య వైరం అంతకంతకు పెరుగుతోంది ప్రమంచ పై ఆధిపత్యం కోసం రెండు దేశాలు పోటీ పడుతున్నాయి. ఇలాంటి తరుణంలో షాకింగ్ న్యూస్ బయటకొచ్చింది. అమెరికా లో సీక్రెట్ గా నడుస్తున్న చైనా వైరస్ ల్యాబ్(china virus Lab) ఒకటి బైట పడింది.

కాలిఫోర్నియా(Calfornia) రాష్ట్రంలోని రీడ్లీ సిటీలో దీన్ని గుర్తించారు. చైనాకు చెందిన ఒక బయోటెక్‌ కంపెనీ(Biotech Company) నడుపుతున్న ఆ ల్యాబ్‌లో వందలకొద్దీ ప్రమాదకర వైరస్‌లతో ప్రయోగాలు చేస్తున్నట్టు వెల్లడైంది. ఈ విషయం తెలియడంతో రీడ్లీ సిటీ(Reedley City) ప్రజలు ఉలిక్కిపడ్డారు. ఆ ల్యాబ్‌లో కరోనా వైరస్‌, మలేరియా వైరస్‌, హెచ్‌ఐవీ వైరస్‌, హెపటైటిస్‌ వైరస్‌, స్పృహలేని స్థితిలో 1000 ఎలుకలు, 200 చనిపోయిన ఎలుకలు ఉన్నట్టు దర్యాప్తులో తేలింది. వందలకొద్దీ కుండలలో వైరస్‌లను(Virus) నింపి ఇండస్ట్రియల్‌ ప్రీజర్‌లలో నిల్వచేసి ఉంచారని అమెరికా ప్రభుత్వ అధికారులు కనుగొన్నారు. “ప్రెస్టీజ్ బయో టెక్‌”(Prestige Bio Tech) పేరుతో కాలిఫోర్నియా రాష్ట్రంలోని రీడ్లీ సిటీలో చైనాకు చెందిన ఒక డయాగ్నస్టిక్‌ ల్యాబ్‌ ఒకటి ఏర్పాటయింది.

ఆ ల్యాబ్ లో స్థానికులకు కరోనా టెస్టులు, ప్రెగ్నెసీ టెస్టులు చేసేవారు. ఆ చైనా ల్యాబ్‌ బిజినెస్‌ చేస్తోందని అందరూ భావించారు. కానీ ఆ ల్యాబ్‌ సెల్లార్‌ లోపలి నుంచి బయటికి గ్యాస్‌ రిలీజ్‌ అయ్యేందుకు ఒక గొట్టాన్ని అమర్చడంతో ఆరోగ్య విభాగం అధికారులకు అనుమానం వచ్చింది. వారు వెళ్లి తనిఖీ చేయగా... డయాగ్యస్టిక్‌ ల్యాబ్‌(Diagnostic Lab) మాటున ప్రమాదకర వైరస్‌ లతో రీసెర్చ్‌ చేసే ల్యాబ్‌ నడుస్తోందని బట్టబయలైంది. బిల్డింగ్‌లోని సెల్లార్‌ భాగంలో సీక్రెట్‌ ల్యాబ్‌ను నడిపిస్తున్నారని తేలింది. ఈ డయాగ్సస్టిక్‌ ల్యాబ్‌కు కాలిఫోర్నియాలో బిజినెస్‌ చేసే పర్మిషన్స్‌ లేవని అధికారులు చెప్పారు.

ప్రెస్టీజ్ బయోటెక్‌తో కమ్యూనికేట్ చేయడానికి అధికారులు అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ, ఫ్రెస్నో కౌంటీ అధికారులు కంపెనీ సమాచారంతో ముందుకు రావడం లేదని ప్రమాదకర వైద్య వ్యర్థాల పారవేయడం కోసం ఒక ప్రణాళికను అందించడం వంటి ఆదేశాలను పాటించడంలో విఫలమైందని అమెరికా అధికారులు ఆరోపిస్తున్నారు.

అయితే ఈ ల్యాబ్ లో ఎలాంటి టెస్టులు చేసారు. ల్యాబ్ కి వచ్చిన వారికీ ఏదయినా వైరస్ సోకేటట్లు చేసారా అనేది ఇంకా తెలియలేదు. ఇంతకీ ఈ సీక్రెట్ ల్యాబ్ లు కేవలం అమెరికా వరకే పరిమతమయ్యాయ, లేక మిగిలిన దేశాలకు కూడా విస్తరించాయ అనే విషయం లో ఇంకా క్లారిటీ రాలేదు.

చైనా కి ఇలాంటివి కొత్తవేమీ కావు కొద్దీ నెలలక్రితం అమెరికా లోనే రహస్యంగా పోలీస్ వ్యవస్థని నడుపుతున్న ఇద్దరు చైనీయులని అమెరికా అరెస్ట్ చేసింది. వారిచ్చిన సమాచారం ప్రకారం ప్రపంచంలోని 53 దేశాలలో చైనా రహస్య పోలీస్ వ్యవస్థని నడుపుతున్నట్లు వెల్లడైంది. ఓవర్సీస్ పోలీస్ సర్వీసెస్ పేరుతో చైనా వీటిని పలు దేశాలలో ఏర్పాటు చేసింది. అయితే ఆయా దేశాలకు అనుమానం రాకుండా, అక్కడ స్థిరపడ్డ చైనీయులకు సపోర్ట్ కోసం అని చెప్తూనే గూఢచర్యానికి పాల్పడుతుతోంది చైనా.

అమెరికాలో చైనా పోలీసులని అరెస్ట్ చేయడం, ఇప్పుడు సీక్రెట్ ల్యాబ్ ని కనుగొనడం చుస్తే ఆ రెండు దేశాల ద్వైపాక్షిక సంబంధాలపై ప్రభావం పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Updated On 5 Aug 2023 1:35 AM GMT
Ehatv

Ehatv

Next Story