ఈ మధ్య కాలంలో చిన్న వయసులో గుండెపోటు (Heart Attack)తో మరణిస్తున్నవారి సంఖ్య పెరుగుతుంది. చిన్నవయసులోనే గుండెపోట్ల మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇలాంటి విషాదమే మరోకొటి చోటు చేసుకుంది.

HEART STROKE-compressed
ఈ మధ్య కాలంలో చిన్న వయసులో గుండెపోటు (Heart Attack)తో మరణిస్తున్నవారి సంఖ్య పెరుగుతుంది. చిన్నవయసులోనే గుండెపోట్ల మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇలాంటి విషాదమే మరోకొటి చోటు చేసుకుంది. నారాయణపేట (Narayanapet) జిల్లా హన్వాడ (Hanwada) మండలం బుడమతండాకు చెందిన 15 ఏళ్ల శ్రీకాంత్ (Srikanth) గుండెపోటుతో అర్ధాంతరంగా కన్నుమూశాడు. ధన్వాడ (Dhanwada) గిరిజన గురుకుల పాఠశాలలో చదువుతున్న శ్రీకాంత్‌కు గుండెపోటు రావడంతో హుటాహుటిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అక్కడి నుంచి జిల్లా కేంద్రమైన నారాయణపేట ఆస్పత్రికి తరలించిన శ్రీకాంత్ దక్కలేదు. శ్రీకాంత్ అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు ధృవీకరించారు. దీంతో ఆస్పత్రి ప్రాంగణంలో తల్లిదండ్రులు, బంధువుల రోదనలు మిన్నంటాయి. ఇంత చిన్న వయసులో ఈ గుండెపోట్లు కలిచివేస్తున్నాయని అక్కడున్న స్థానికులు కంటనీరు పెట్టారు.
