అనంతపురంజిల్లా రాయదుర్గం నియోజకవర్గం(Rayadurgam Constituency)లో వైసీపీ టీడీపీలమధ్య సవాళ్ల పర్వం కొనసాగుతోంది. ప్రభుత్వ విప్ (Govt chief whip)కాపు రామచంద్రారెడ్డి (kapu ramachandra reddy)..టీడీపీ నేత, మాజీ మంత్రి(Ex minister) కాల్వ శ్రీనివాసుల(Kalva Srinivasulu) మధ్య అవినీతి, లోకల్.. నాన్ లోకల్(local-Nonlocal) పంచాయితీ తారాస్థాయికి చేరుకుంది. కాల్వ పెద్ద అవినీతిపరుడని రామచంద్రారెడ్డి అంటుంటే..దమ్ముంటే దాన్ని నిరూపించాలంటూ కాల్వ శ్రీనివాసులు సవాల్ చేశారు.

ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్నకొద్దీ రాజకీయాలు హీటెక్కుతున్నాయి. అధికార ప్రతిపక్ష నేతలు ఒకరిపై ఒకరు ఆరోపణలు, ప్రత్యారోణలతో రెచ్చిపోతున్నారు. తాజాగా అనంతపుంరజిల్లా రాయదుర్గం నియోజకవర్గంలో టీడీపీ-వైసీపీ(tdp-ycp) నేతలు మాటల యుద్ధానికి దిగారు. 14 ఏళ్ల చంద్రబాబు ప్రభుత్వ హయాంలో రాయదుర్గం నియోజకవర్గానికి కాల్వ శ్రీనివాసులు ఏం చేశారో చర్చకు సిద్ధమా అంటూ ప్రభుత్వ విప్ కాపు రాచమచంద్రారెడ్డి సవాల్ చేశారు. రాయదుర్గం అభివృద్ధిపై కాల్వ శ్రీనివాసులు అబద్ధాలు చెబుతున్నారని ఆరోపించారు. కరోనా(corona) సమయంలో చంద్రబాబు(Chandrababu) రాష్ట్రాన్ని వదిలిపెట్టి వెళ్లిపోతే..కాల్వ శ్రీనివాసులు రాయదుర్గం నుంచి పారిపోయారని విమర్శిస్తున్నారు. అయితే కాపు రాచమంద్రారెడ్డి కామెంట్స్‎కు గట్టి కౌంటర్ ఇచ్చారు టీడీపీ నేత, మాజీ మంత్రి కాల్వ ‎శ్రీనివాసులు(Kalva Srinivasulu). మూడు నెలల్లో టీడీపీ అధికారంలోకి వస్తుందని..రామచంద్రారెడ్డి అవినీతి చిట్టాని నిరూపించి, జైలుకు పంపిస్తామన్నారు. తనను నాన్ లోకల్ అంటున్న కాపు రామచంద్రారెడ్డి.. కర్నాటక(Karnataka) నుంచి వలస వచ్చిన విషయం అందరికీ గుర్తుందన్నారు. ఆయనలా కాకుండా తను మాత్రం ఇరవై ఐదేళ్ల క్రితమే ఎంపీగా రాయదుర్గం(mp Rayadurgam) వచ్చానన్నారు కాల్వ శ్రీనివాసులు.

మొత్తానికి అనంతపురంజిల్లా రాయదుర్గంలో ఎన్నికలకు ముందే రాజకీయం రగులుతోంది. ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి..టీడీపీ నేత, మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు మధ్య సవాళ్ల పర్వం తారాస్థాయికి చేరుకుంది. ఏదేమైనా రాయదుర్గం రాజకీయం ఇప్పుడే ఇలా ఉంటే ఎన్నికల నాటికి ఎలా ఉంటుందో చూడాలి.

Updated On 27 Dec 2023 5:32 AM GMT
Ehatv

Ehatv

Next Story