JanaSena Focus: రాజమండ్రి రూరల్‌పై జనసేన ఫోకస్..గోరంట్ల బుచ్చయ్యను బలి చేస్తారా?
ఏపీలో అధికార, ప్రతిపక్ష పార్టీల్లో అభ్యర్థుల ఎంపిక చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే అధికార వైసీపీలో అభ్యర్థుల ప్రక్షాళన జరుగుతుండగా.. ప్రతిపక్ష టీడీపీలోనూ టికెట్ల పంచాయితీ మొదలైంది. పొత్తులో భాగంగా కొన్ని చోట్ల టీడీపీ సిట్టింగ్ స్థానాలపై జనసేన నేతలు గురి పెట్టారు. ముఖ్యంగా సీనియర్ నేత గోరంట్ల సీటుకే ఎసరు పెడుతున్నారని సమాచారం. మరి.. ఎమ్మెల్యే గోరంట్ల సీటు త్యాగానికి సిద్దపడతారా? జనసేన ఒత్తిడికి తలొగ్గి..చంద్రబాబు అందుకు ఒప్పుకుంటారా? అనేదిదానిపై తూర్పుగోదావరిజిల్లాల్లో జోరుగా చర్చ జరుగుతోంది.

రాజమండ్రి రూరల్(Rajahmundry Rural) నుంచి టీడీపీ సీనియర్ నేత(TDP Senior leader) గోరంట్ల బుచ్చయ్య చైదరి (Gorantla Butchaiah Chowdhary)ఎమ్మెల్యేగా గెలిచారు. వైసీపీ హవా కొనసాగిన గత ఎన్నికల్లోనూ బుచ్చయ్య చైదరి విజయకేతనం ఎగరవేశారు. అంతేకాదు రాజమండ్రి రూరల్‌లో గట్టి పట్టున్న నేత. ఇలాంటి సిట్టింగ్ స్థానంపై జనసేన నేతలు ఫోకస్ పెట్టారు. మరి..టీడీపీ కంచుకోట, బలమైన సీనియర్ నేత ఉన్న బుచ్చయ్య చౌదరి సీటును తెలుగుదేశం(tdp) త్యాగం చేస్తుందా? అనేది రాజకీయా వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. మరోవైపు వైసీపీ నుంచి మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్(Minister chelluboina Venugopal) పోటీకి మళ్లీ రెడీ అవుతున్నారు. ఇప్పటికే సీఎం జగన్(cm jagan) ఆయనను రాజమండ్రి రూరల్ ఇంఛార్జీగా నియమించారు. గత ఎన్నికల్లోనూ వైసీపీ ఇక్కడ మూడో స్థానంలో నిలిచింది. ఇప్పుడు మంత్రి వేణుగోపాల్ ఎన్నికల బరిలో దిగుతుండటంతో గోరంట్ల బుచ్చయ్యకు గట్టి పోటీ ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ ఇద్దరు రాజకీయ ఉద్దుండులేనన్న పేరు ఈ నియోజకవర్గంలో ఉంది. టీడీపీకి గట్టి పట్టు ఉండటంతోపాటు బలమైన నేత ఉన్న సీటుపై జనసేన నేతలు(JanaSena leaders) సీరియస్ ఫోకస్ పెట్టడం చర్చనీయాంశంగా మారింది. పొత్తులో భాగంగా ఈ సీటును దక్కించుకోవాలనే పట్టుదలతో ఉన్నారు. మరి.. ఇక్కడి నుంచి పోటీ చేసేందుకు ఉవ్విళ్లూరుతున్న జనసేన నేత కందుల దుర్గేశ్(Kandula Durgesh)కు ఈ సీటు దక్కుతుందా? సిట్టింగ్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అందుకు ఒప్పుకుంటారా? పొత్తు ధర్మం అంటున్న జనసేనకు తలొగ్గి టీడీపీ అధినేత చంద్రబాబు(chandrababu.. సిట్టింగ్ ఎమ్మెల్యే బుచ్చయ్యను బలి చేసే సాహసం చేస్తారా? అనేదానిపై రాజమండ్రి రూరల్ సెగ్మెంట్లో జోరుగా చర్చ జరుగుతోంది.