రైతుబంధు కోసం ఎదురు చూస్తున్న రైతులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. యాసంగి సీజన్ రైతుబంధు డబ్బులను నేటి నుంచి రైతుల ఖాతాల్లో జమ చేయనుంది. గత ఏడాది డిసెంబర్ 12న ఈ కార్యక్రమం ఆర్భాటంగా ప్రారంభించినప్పటికీ..నిధుల కొరత వల్ల ఆలస్యమైపోయింది. ఇప్పటి వరకు కేవలం ఎకరంలోపు భూమి ఉన్న రైతుల ఖాతాల్లో మాత్రమే రైతుబంధు డబ్బులు జమ చేశారు. దీంతో రైతుబంధు డబ్బులు వస్తాయా.. రావా అన్న డైలమా అందరిలో ఉండింది.
రైతుబంధు కోసం ఎదురు చూస్తున్న రైతులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. యాసంగి సీజన్ రైతుబంధు డబ్బులను నేటి నుంచి రైతుల ఖాతాల్లో జమ చేయనుంది. గత ఏడాది డిసెంబర్ 12న ఈ కార్యక్రమం ఆర్భాటంగా ప్రారంభించినప్పటికీ..నిధుల కొరత వల్ల ఆలస్యమైపోయింది. ఇప్పటి వరకు కేవలం ఎకరంలోపు భూమి ఉన్న రైతుల ఖాతాల్లో మాత్రమే రైతుబంధు డబ్బులు జమ చేశారు. దీంతో రైతుబంధు డబ్బులు వస్తాయా.. రావా అన్న డైలమా అందరిలో ఉండింది. యాసంగి పెట్టుబడులకు ఉపయోగపడుతాయన్న రైతుబంధు డబ్బులు జమకాకపోవడంతో రైతులు పెట్టుబడి కోసం ఇబ్బందిపడ్డారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి(Minister of Agriculture) తుమ్మల నాగేశ్వర్‌రావు(Tummala Nageshwar Rao) శనివారం రాష్ట్ర స్థాయి వ్యవసాయశాఖ అధికారుల సమావేశంలో రైతుబంధు పథకం డబ్బులు వేగంగా రైతుల ఖాతాల్లో జమచేయాలని ఆదేశించారు. రైతుల సంక్షేమమే తమ ప్రభుత్వానికి ప్రాధాన్యత అంశమని , గత ప్రభుత్వం వదిలేసి వెళ్లిన క్లిష్టమైన ఆర్ధిక పరిస్థితిలో కూడా రైతుబంధు నిధులను సకాలంలో అందజేయడానికి కట్టుబడి ఉన్నామని తుమ్మల తెలిపారు. జనవరి నెలాఖరు నాటికి ఈ ప్రక్రియను పూర్తి చేసేలా వ్యవసాయ శాఖ అధికారులు కసరత్తు చేసినట్లు తెలుస్తోంది.
ఇక..బీఆర్‌ఎస్ (BRS) ప్రభుత్వం హయాంలో ఖరీఫ్ సీజన్‌కు సంబంధించిన రైతుబంధు డబ్బులను జమ చేసింది. రోజుకో ఎకరం చొప్పున వారం, 10 రోజుల్లో రైతుల ఖాతాల్లో నిధులు జమ అయ్యేవి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎకరాకు 15 వేలు జమచేస్తామని హామీ ఇచ్చింది. అంటే సీజన్‌కు రూ.7500 జమ చేస్తామని తెలిపింది. కానీ విధివిధానాలు ఖరారు కానందున.. గత ప్రభుత్వం ఇచ్చిన తరహాలోనే రైతుబంధు ఖాతాల్లో వేయాలని నిర్ణయించింది. డిసెంబర్ 11 నుంచి రైతుబంధు డబ్బులు జమ అవుతాయని చెప్పినా.. దాదాపు నెల కావొస్తున్నా నిధులు జమ కాకపోవడంతో రైతులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈరోజు నుంచైనా రైతు బంధు నిధులు పడతాయేమోనని రైతులు ఆశగా ఎదురుచూస్తున్నారు