తెలంగాణలో రాగల మూడురోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది.

తెలంగాణలో రాగల మూడురోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ మేరకు ఎల్లో అలెర్ట్‌ని జారీ చేసింది. హిందు మహాసముద్రం, ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన ఫెంగల్‌ (Cyclone Fengal)తుఫాను నేపథ్యంలో తమిళనాడుతో పాటు ఆంధ్ర ప్రదేశ్ లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తుఫాను ప్రభావంతో తెలంగాణలోనూ వర్షాలుపడుతాయని, ఆదివారం నుంచి సోమవారం ఉదయం వరకు ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. సోమవారం నుంచి మంగళవారం వరకు భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్‌, వరంగల్‌, హన్మకొండ, జిల్లాల్లో వానలుపడే అవకాశాలున్నాయంది. అలాగే ఈ నెల 4 వ తేదీ వరకు తేలికపాటి జల్లులు పడే సూచనలున్నాయని తెలిపింది.

ehatv

ehatv

Next Story