భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీసింధు రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో ఘనంగా జరిగింది.
భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీసింధు రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో ఘనంగా జరిగింది. పోసిడెక్స్ టెక్నాలజీస్ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వెంకట దత్త సాయి చేత సింధు మూడు ముళ్లు వేయించుకుంది. ఈ వేడకలకు 140 మంది అతిథులు హాజరైనట్లు సమాచారం. ఉదయ్‌పూర్‌లోని సాగర్ సరస్సులో ఉన్న 21 ఎకరాల్లో విస్తరించి ఉన్న దీవిలో సింధు-వెంకట దత్త సాయి పెళ్లి వేడుక జరిగింది. ఆరావళి పర్వతాల మధ్య ఉన్న ఈ దీవిలో వంద గదులతో రఫల్స్ సంస్థ ఈ భారీ రిసార్ట్‌ను నిర్మించింది. అతిథులను పడవల్లో వివాహ వేదికకు తీసుకెళ్లారు. ఈ రిసార్ట్‌లో ఒక గదికి రూ. లక్ష వరకు అద్దె ఉంటుంది.కేంద్ర మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ ఈ వేడుకకు హాజరయ్యారు. అయితే పీవీ సింధు వివాహ పెళ్లి ఫొటోలు, వీడియోలు విడుదల కాలేదు. ఒక ఫొటో మాత్రం సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఇక్కడి గదికి ఒక్క రోజు లక్ష రూపాయల వరకు చార్జి ఉంటుంది. అలా 100 గదులను పెళ్లి కోసం బుక్ చేశారు. మంగళవారం హైదరాబాద్‌లో రిసెప్షన్ జరగనుంది.