ఏపీలో ఎన్నికలకు ముందు వైసీపీ అధినేత జగన్ తీసుకున్న ఇంఛార్జీల మార్పు నిర్ణయం పార్టీలో కలకలంరేపుతోంది. సర్వేల్లో ప్రజా వ్యతిరేకత కనిపించిన సిట్టింగ్ అభ్యర్థులను మార్చడం ఆ పార్టీకి తలనొప్పిగా మారింది. ఒకవైపు పార్టీ నిర్ణయాన్ని శిరసావహిస్తామని చెబుతూనే అసమ్మతిగళం వినిపిస్తున్నారు. దీంతో ఎన్నికల నాటికి పరిస్థితి ఎలా ఉంటుందోనన్న ఆందోళన పార్టీ వర్గాల్లో మొదలైంది. అసెంబ్లీ స్థానాలు, ఇంఛార్జీల మార్పు, ప్రభుత్వ వ్యతిరేకత అధికార పార్టీ విజయవకాశాలను దెబ్బతీసే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

ఏపీలో ఎన్నికలకు ముందు వైసీపీ అధినేత జగన్(ycp president jagan) తీసుకున్న ఇంఛార్జీల మార్పు నిర్ణయం పార్టీలో కలకలంరేపుతోంది. సర్వేల్లో ప్రజా వ్యతిరేకత కనిపించిన సిట్టింగ్ అభ్యర్థులను మార్చడం ఆ పార్టీకి తలనొప్పిగా మారింది. ఒకవైపు పార్టీ నిర్ణయాన్ని శిరసావహిస్తామని చెబుతూనే అసమ్మతిగళం వినిపిస్తున్నారు. దీంతో ఎన్నికల నాటికి పరిస్థితి ఎలా ఉంటుందోనన్న ఆందోళన పార్టీ వర్గాల్లో మొదలైంది. అసెంబ్లీ స్థానాలు, ఇంఛార్జీల మార్పు, ప్రభుత్వ వ్యతిరేకత అధికార పార్టీ విజయవకాశాలను దెబ్బతీసే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

ఏపీలో ఎన్నికలకు మరో రెండు నెలల సమయం ఉంది. ఈ నేపథ్యంలో ముందస్తుగా అధికార పార్టీ మొదలుపెట్టిన అభ్యర్థుల ప్రక్షాళన తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఏడాదిగా సీఎం జగన్ నిర్వహిస్తున్న సర్వేల్లో పనితీరు బాగోలేదని తేలిన అభ్యర్థులను మార్చాలని నిర్ణయించుకున్నారు. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సిట్టింగ్ లకే మళ్లీ టికెట్ ఇవ్వడం వల్లే అధికార బీఆరెస్ ఓడిపోయిందనే ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ప్రజా వ్యతిరేకత ఉన్న అభ్యర్థులను మార్చాల్సిందేనన్న నిర్ణయానికి వచ్చారు సీఎం జగన్(cm jagan). అయితే వైసీపీలో అభ్యర్థుల మార్పుపై నేతల నుంచి వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. జిల్లాపై పెత్తనం చేసిన పెద్దలపై లేని వ్యతిరేకత తమపై ఎలా ఉంటుందనేది పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్​బాబు(Puthalapattu MLA MS Babu) ఆక్రోశం. ఎస్సీ, బీసీ ఎమ్మెల్యేలనే టార్గెట్​ చేస్తున్నారని..టిక్కెట్ నిరాకరించడం ఎంత వరకు సమంజసమనేది ఎమ్మెల్యే బాబు ఆవేదన. తొలి జాబితాలో కూడా ఎస్సీ, బీసీ నేతల స్థానాలే ఎక్కువగా మార్పులున్నాయి. ఓసీ నేతల నియోజకవర్గాల్లో మార్పులు లేదా టిక్కెట్​ నిరాకరిస్తే వాళ్లకు ఇతర పార్టీల్లో సీటు దక్కడానికి అవకాశముంటుంది. కానీ..బడుగు నేతలకు టిక్కెట్ ​ఇవ్వకపోయినా, నియోజకవర్గం మార్చినా పెద్దగా తిరగబడరని పార్టీ అధిష్టానం భావిస్తున్నట్లు రాజకీయ పరిశీలకులు అంటున్నారు. కొత్త వాళ్లకు టిక్కెట్లు ఇవ్వడం.. నియోజకవర్గాల మార్చడం గురించి పార్టీ శ్రేణుల్లో భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అయితే సాధారణ కార్యకర్తలు మాత్రం సీఎం జగన్ తీసుకున్న అభ్యర్థుల మార్పు నిర్ణయం సరైనదేనంటున్నారు. ఒక నియోజకవర్గంలో తరాల తరబడి ఒక కుటుంబమే పాతుకుపోతే కొత్త వాళ్లకు అవకాశం ఎప్పుడొస్తుందని ప్రశ్నిస్తున్నారు. కనీసం కొన్ని సీట్లలోనైనా కొత్త వాళ్లకు అవకాశం ఇవ్వాలన్న సీఎం జగన్ సాహసాన్ని పార్టీ శ్రేణులు అభినందిస్తున్నాయి. అభ్యర్థులపై వ్యతిరేకత రావడానికి దారితీసిన అంశాలు బోలెడున్నాయి. అందువల్ల ప్రజల్లో సానుకూలతలేని అభ్యర్థులను మార్చడం వల్ల గెలుపు అవకాశాలు మెరుగవుతాయని అధిష్టానం భావిస్తోంది. ఐదేళ్లలో ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్లి ప్రచారం చేయాలని సీఎం జగన్​ పార్టీ యంత్రాంగానికి నిర్దేశించారు. మరి.. జగన్​ వ్యూహం ఫలిస్తుందా.. బెడిసి కొడుతుందా? అనేదానిపై ఏపీ పొలిటికల్ స్కరిల్‎లో ఆసక్తికర చర్చ జరుగుతోంది.

Updated On 3 Jan 2024 3:39 AM GMT
Ehatv

Ehatv

Next Story