ఏం ఎండల్రా దేవుడా? వేడికి చచ్చిపోతున్నా..! జనం రోజుకు నాలుగైదుసార్లన్నా ఈ మాటలనుకుంటుంటారు! ఎండలు అలా ఉన్నాయి మరి! మునుపెన్నడూ లేని విధంగా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దేశంలోని పలు రాష్ట్రాలు నిప్పుల కుంపటిలా మారాయి. ఉదయం తొమ్మిది గంటల నుంచే ఎండలు మండిపోతున్నాయి.
ఏం ఎండల్రా దేవుడా? వేడికి చచ్చిపోతున్నా..! జనం రోజుకు నాలుగైదుసార్లన్నా ఈ మాటలనుకుంటుంటారు! ఎండలు అలా ఉన్నాయి మరి! మునుపెన్నడూ లేని విధంగా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దేశంలోని పలు రాష్ట్రాలు నిప్పుల కుంపటిలా మారాయి. ఉదయం తొమ్మిది గంటల నుంచే ఎండలు మండిపోతున్నాయి. ఇంట్లోంచి బయటకు వెళ్లాలంటే భయమేస్తున్నది. కాకపోతే ఆఫీసులకు, ఇతర పనుల కోసం బయటకు వెళ్లక తప్పదు. బయటకు వెళితే ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర కనీసం రెండు నిమిషాలైనా ఉండాల్సి వస్తుంది. ఇలాంటివారి కోసం పుదుచ్చేరి ప్రభుత్వం ఓ చచ్కటి ఆలోచన చేసింది. వాహనదారులు ఎండలో ఇబ్బందిపడకుండా ఉండేందుకు గ్రీన్ నెట్స్(Green Nets)ను పరిచింది. వాహనదారులపై ఎండపడకుండా చేసింది. పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పలు సిగ్నళ్ల దగ్గర ఈ ఏర్పాటు చేశారు అధికారులు. కొంతదూరం వరకు గ్రీన్ షెడ్ నెట్స్‌ను ఏర్పాటు చేశారు. ఈ చలువపందిళ్ల దృశ్యాలు సోషల్ మీడియా(Social Media)లో వైరల్ అవుతున్నాయి. ఈ వీడియోలను చూసి పుదుచ్చేరి సర్కారును నెటిజన్లు మెచ్చుకుంటున్నారు.