ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచిన ఐదు గ్యారంటీల అమలే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం కార్యచరణ రూపొందించింది. అర్హులైన పేదలకు సంక్షేమ పథకాలు అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ‘ప్రజాపాలన(Prajapalana)’ నిర్వహిస్తోంది. రేపటి నుంచి ప్రజాపాలన ధరఖాస్తుల స్వీకరించనుంది. దీని కోసం ఒక్కో గ్యారంటీకి వర్వేరుగా దరఖాస్తు ఇవ్వాల్సిన పని లేదు. ఐదు గ్యారంటీల వివరాలతో కూడిన ధరఖాస్తు నమూనాను రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేసింది. ఈ మేరకు గురువారం నుంచి జనవరి 6 వరకు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించనున్న సదస్సుల కోసం ప్రజా పాలన గ్యారెంటీ దరఖాస్తును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanthredy) విడుదల చేశారు.

రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామాలు, మునిసిపాలిటీలు, కార్పొరేషన్లలోని వార్డులకు ప్రొఫార్మాలు చేరవేసేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. సామాన్య ప్రజలు చాలా సులభంగా అర్థం చేసుకొని, ఐదు నిమిషాల్లో నింపేలా దరఖాస్తును రూపొందించారు. ఐదు గ్యారెంటీల్లో కోసం గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో ప్రతి ఇంటికి సిబ్బందే వచ్చి దరఖాస్తులు అందజేయనున్నారు. దీనికి సంబందించి ప్రాంతాల వారీగా అధికారులు ముందుస్తుగానే పూర్తి సమాచారం ఇస్తారని హైదరాబాద్‌, రంగారెడ్డి ఇంఛార్జీ మంత్రులు పొన్నం ప్రభాకర్‌(Ponnam Prabhakar), దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు(Sridhar babu) చెప్పారు.

కాంగ్రెస్‌ ప్రభుత్వం అమలు చేయనున్న ఐదు గ్యారంటీలకు అర్హులైనవారు దరఖాస్తులు చేసుకోవాల్సి ఉంటుంది. చేయూత పథకం కింద రూ.4000 పెన్షన్, దివ్యాంగులకు రూ.6000 పెన్షన్ పొందాలంటే రేపటినుంచే ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకోవాలి. దీని కోసం ఫోటో, రేషన్ కార్డు, ఆధార్ జిరాక్స్ ఇవ్వాలని అధికారులు సూచించారు. రేషన్ కార్డు లేకపోయినా దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం పెన్షన్ పొందుతున్న వారు, ప్రజా భవన్‌లో ఇప్పటికే అప్లై చేసిన వారు మళ్లీ కొత్తగా దరఖాస్తు చేసుకోవాల్సి అవసరం లేదని సంబంధిత అధికారులు వెల్లడించారు. పెన్షన్ రాని అర్హులు మాత్రం తప్పనిసరి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈనెల 28 నుంచి జనవరి 6 వరకు ధరఖాస్తుల స్వీకరణ కొనసాగనుంది. దరఖాస్తులో ఏ పథకానికి అప్లై చేశారో చూసి రశీదు కూడా ఇస్తారు.

అయితే తెల్ల రేషన్‌ కార్డులు కలిగిన ఉన్న వారు మాత్రమే గ్యారెంటీలకు అర్హులనే ప్రచారాన్ని మంత్రులు శ్రీధర్ బాబు, పొన్న ప్రభాకర్ కొట్టిపారేశారు. ఐదు గ్యారంటీలకు అర్హులమని భావిస్తున్నవారు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. కొత్త రేషన్‌ కార్డులిచ్చే ఆలోచన ప్రభుత్వానికి ఉందని, కార్డులు లేని వారు, ఇప్పటికే ఉన్న కార్డుల్లో కుటుంబ సభ్యుల పేర్లు చేర్పించాలనుకునేవాళ్లూ దరఖాస్తు చేసుకోవచ్చునని చెప్పారు. ‘ప్రజా పాలన’లో పౌరుల నుంచి స్వీకరించే దరఖాస్తులతో డేటా సేకరిస్తామని, ఆ తర్వాతే ఆరు గ్యారెంటీల అమలుకు సంబంధించి మార్గదర్శకాలు రూపొందిస్తామని తెలిపారు.

Updated On 27 Dec 2023 2:27 AM GMT
Ehatv

Ehatv

Next Story