ఢిల్లీ హైకోర్టు(Delhi High Court) సంచనల తీర్పు ఇచ్చింది. ఖైదీలకూ సంతానోత్పత్తి హక్కు (Prisoners also have reproductive rights) ఉంటుందని స్పష్టం చేసింది. హత్య కేసులో జీవిత ఖైదు(life imprisonment) అనుభవిస్తున్న ఓ వ్యక్తికి సంతానోత్పత్తి కోసం.. ఢిల్లీ హైకోర్టు నాలుగు వారాల పెరోల్ (four-week parole) మంజూరు చేసింది. తన భర్త ద్వారా సంతానాన్ని పొందే అవకాశం కల్పించాలన్న ఖైదీని భార్య అభ్యర్థనను పరిగణలోకి తీసుకున్న హైకోర్టు..ఈ మేరకు తీర్పు వెలువరించింది.

ఢిల్లీ హైకోర్టు(Delhi High Court) సంచనల తీర్పు ఇచ్చింది. ఖైదీలకూ సంతానోత్పత్తి హక్కు (Prisoners also have reproductive rights) ఉంటుందని స్పష్టం చేసింది. హత్య కేసులో జీవిత ఖైదు(life imprisonment) అనుభవిస్తున్న ఓ వ్యక్తికి సంతానోత్పత్తి కోసం.. ఢిల్లీ హైకోర్టు నాలుగు వారాల పెరోల్ (four-week parole) మంజూరు చేసింది. తన భర్త ద్వారా సంతానాన్ని పొందే అవకాశం కల్పించాలన్న ఖైదీని భార్య అభ్యర్థనను పరిగణలోకి తీసుకున్న హైకోర్టు..ఈ మేరకు తీర్పు వెలువరించింది. భార్య వయసు 38 ఏళ్లు, భర్త వయసు 41 ఏళ్లను ప్రస్తావిస్తూ..'శిక్షా కాలం పూర్తయ్యే సరికి వయసు మీరిపోతుందని.. ఇది వారి సంతానోత్పత్తికి అవరోధంగా మారుతుందని జస్టిస్ట స్వర్ణకాంత శర్మ(Justice Swarnakanta Sharma) అభిప్రాయపడ్డారు. ఈ క్రమంలో భర్త ద్వారా సంతానాన్ని పొందాలన్న భార్య హక్కును ఎవరూ అడ్డుకోలేరు' అని అన్నారు. ప్రస్తుత కేసులోని పూర్వాపరాలను పరిశీలించిన తర్వాత దాంపత్య జీవనం కోసం అనుమతివ్వడం లేదని, కేవలం వంశాన్ని నిలబెట్టుకోవాలన్న భార్య ఆకాంక్షను, హక్కును గౌరవిస్తున్నట్లు తన తీర్పులో వివరించారు. ఖైదీ ఇప్పటికే 14 ఏళ్లుగా జైలులో ఉన్న విషయాన్నీ న్యాయమూర్తి ఈ సందర్బంగా ప్రస్తావించారు. పెరోల్‌ కోసం రూ.20 వేలకు వ్యక్తిగత బాండును సమర్పించడంతో పాటు ఒకరి పూచీకత్తు ఇవ్వాలని షరతు విధించారు.

Updated On 28 Dec 2023 11:47 PM GMT
Ehatv

Ehatv

Next Story