ఇటీవల లోకేష్‌ను (Lokesh) కలిసిన ప్రశాంత్‌ కిషోర్‌ (Prashanth Kishore) టీడీపీతో (TDP) కలిసి పనిచేయడంపై క్లారిటీ ఇచ్చేశారు. సోమవారం కూడా లోకేష్‌తో ప్రశాంత్‌ కిషోర్‌ కలిశారు. దీంతో టీడీపీతో కలిసి పనిచేసేందుకేనని, రాబోయే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ జరిగిందని ఆ పార్టీ అనుకూల మీడియాలో వార్తలు వచ్చాయి.

ఇటీవల లోకేష్‌ను (Lokesh) కలిసిన ప్రశాంత్‌ కిషోర్‌ (Prashanth Kishore) టీడీపీతో (TDP) కలిసి పనిచేయడంపై క్లారిటీ ఇచ్చేశారు. సోమవారం కూడా లోకేష్‌తో ప్రశాంత్‌ కిషోర్‌ కలిశారు. దీంతో టీడీపీతో కలిసి పనిచేసేందుకేనని, రాబోయే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ జరిగిందని ఆ పార్టీ అనుకూల మీడియాలో వార్తలు వచ్చాయి. దీంతో టీడీపీ క్యాడర్‌ కూడా ఉత్సహపడింది. అందుకు భిన్నంగా అనూహ్యంగా ప్రశాంత్‌ కిషోర్‌ కీలక ప్రకటన చేశారు. ఈ ఎన్నికల్లో టీడీపీతో కలిసి పనిచేయాలని చంద్రబాబు (Chandrababu) కోరారని ప్రశాంత్‌ కిషోర్‌ చెప్పారు. అయితే తాను చంద్రబాబు కోరికను సున్నితంగా తిరస్కరించానని పీకే అన్నారు. ఎన్నికల వ్యూహకర్తగా ఇప్పుడు నేను చేయడంలేదు. టీడీపీకే కాదు, ఇకపై ఏ పార్టీకి కూడా చేయలేనని ప్రశాంత్ కిషోర్‌ స్పష్టం చేశారు. మా ఇద్దరికీ ఉన్న ఒక కామన్ ఫ్రెండ్ ఒత్తిడి చేయడం వల్ల వెళ్లాల్సి వచ్చింది, నేను టీడీపీ కోసం పని చేయనని చెప్పా. అదే విషయాన్ని చంద్రబాబును కలిసి చెప్పండి అని అడిగితే వారిని కలవాల్సి వచ్చిందని ప్రశాంత్‌ కిషోర్‌ తెలిపారు.

Updated On 22 Jan 2024 11:35 PM GMT
Ehatv

Ehatv

Next Story