ఇంటర్నేషనల్ స్టార్, డార్లింగ్ ప్రభాస్‌ కు స్వల్ప గాయాలు అయ్యాయి.

ఇంటర్నేషనల్ స్టార్, డార్లింగ్ ప్రభాస్‌ కు స్వల్ప గాయాలు అయ్యాయి. సినిమా షూటింగ్‌లో భాగంగా ఆయన కాలికి గాయమయ్యింది. ప్రస్తుతం డాక్టర్ల సలహా మేరకు ప్రభాస్ విశ్రాంతి తీసుకుంటున్నారు. ప్రభాస్‌ హీరో ఈ ఏడాది విడుదలైన బ్లాక్‌బస్టర్‌ ‘కల్కి 2898ఏడీ’(Kalki 2898 AD) సినిమా వచ్చే ఏడాది జనవరి 3న జపాన్‌(Japan)లో విడుదల కానుంది.

సినిమా ప్రమోషన్స్‌లో ప్రభాస్ పాల్గొనాల్సివుంది. కానీ గాయపడటంతో జపాన్‌లో జరిగే కార్యక్రమానికి హాజరు కాలేకపోతున్నారు. ఈ విషయాన్ని తన సోషల్‌మీడియా ద్వారా అభిమానులకు చెబుతూ ఓ పోస్ట్‌ పెట్టారు. ‘నాపై మీరు చూపిస్తున్న ప్రేమాభిమానానికి ధన్యవాదాలు. మూవీ షూటింగ్‌లో కాలికి గాయం అయ్యింది. అందుకే జపాన్ లో జరిగే కార్యక్రమానికి రాలేకపోతున్నాను. జపాన్‌లోని అభిమానులను ఎప్పట్నుంచో కలవాలనుకుంటున్నా. కానీ కుదర్లేదు.. క్షమించండి..’ అంటూ చెప్పుకున్నారు ప్రభాస్‌. ప్రభాస్ కాలికి తగిలిన గాయం పెద్దదేమి కాదని అంటున్నారు సన్నిహితులు. త్వరలోనే షూటింగ్ లలో పాల్గొంటారని చెబుతున్నారు. కాకపోతే జపాన్ ఫ్యాన్స్ ను మిస్ చేసుకోవడమే వారిని బాధ పెడుతున్నది!

ehatv

ehatv

Next Story