తిరుమల(tirumala) అలిపిరి(alipiri) నడకదారిలో చిరుత దాడిలో ప్రాణాలు కోల్పోయిన లక్షిత మృతదేహానికి పోస్టుమార్టం(Postmortem) పూర్తీ చేశారు అధికారులు. లక్షిత(Lakshitha) మృతికి చిరుతే(Cheetah) కారణమ‌ని తేల్చారు ఫోరెన్సిక్ నిపుణులు. లక్షిత తల భాగంపై అటాక్ చేసిన చిరుత.. ఆ భాగాన్ని తినేసినట్లు తెలిపారు. అంత‌కుముందు చిన్నారి మృత‌దేహాన్ని ప‌రిశీలించిన‌ టీటీడీ డీఎఫ్‌వో.. చిన్నారిని చంపింది చిరుత కాదని..

తిరుమల(tirumala) అలిపిరి(alipiri) నడకదారిలో చిరుత దాడిలో ప్రాణాలు కోల్పోయిన లక్షిత మృతదేహానికి పోస్టుమార్టం(Postmortem) పూర్తీ చేశారు అధికారులు. లక్షిత(Lakshitha) మృతికి చిరుతే(Cheetah) కారణమ‌ని తేల్చారు ఫోరెన్సిక్ నిపుణులు. లక్షిత తల భాగంపై అటాక్ చేసిన చిరుత.. ఆ భాగాన్ని తినేసినట్లు తెలిపారు. అంత‌కుముందు చిన్నారి మృత‌దేహాన్ని ప‌రిశీలించిన‌ టీటీడీ డీఎఫ్‌వో.. చిన్నారిని చంపింది చిరుత కాదని.. ఎలుగుబంటి(Bear) చంపి ఉండొచ్చని అనుమానం వ్య‌క్తం చేశారు. ఈ క్ర‌మంలో చిరుతే దాడి చేసినట్లు స్పష్టం చేశారు ఫోరెన్సిక్ డిపార్ట్‌మెంట్(Forensic department) నిపుణులు. పోస్టుమార్టం అనంతరం లక్షిత మృతదేహాన్ని తిరుపతి రుయా మార్చురీ నుంచి నెల్లూరుకు తరలించారు. లక్షిత మృతితో కుటుంబంలో విషాద ఛాయలు అలముకున్నాయి. లక్షిత తల్లి కన్నీరుమున్నీరయ్యింది. తమ బిడ్డ మృతికి అధికారుల తీరే కారణమని ఆరోపించారు. భక్తుల ప్రాణాలతో అధికారులు చెలగాటం ఆడుతున్నారని.. వన్య మృగాలు వరుసగా దాడులు చేస్తుంటే మెట్ల మార్గాన్ని ఎందుకు మూసివేయడం లేదని ప్రశ్నించారు. గ‌తంలోనూ పాప మెట్లు ఎక్కింద‌ని.. అప్పుడు ఏమీ అవ‌లేద‌ని.. ఇలా అవుతుంద‌ని అస‌లు ఊహించ‌లేద‌ని ఆమె ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

Updated On 12 Aug 2023 5:06 AM GMT
Ehatv

Ehatv

Next Story