ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు వై.ఎస్‌.షర్మిల(YS Sharmila)పై ఏఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి(Ponnavolu sudhakar Reddy) మండిపడ్డారు. రాజకీయ లబ్ధి కోసం తనపై ఆమె అసత్య ఆరోపణలు చేశారన్నారు. ఆమె పచ్చి అబద్ధాలు అడుతున్నారని విమర్శించారు. తన వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగేలా షర్మిల మాట్లాడారని విమర్శించారు. కాంగ్రెస్‌ ఎమ్మెల్యే శంకర్‌రావు(Shankar Rao) కారణంగానే వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి(YS Rajasekhar Reddy) పేరును ఎఫ్‌ఐఆర్‌లో(FIR) చేర్చారని గుర్తు చేశారు. వైఎస్‌పై ఆరోపణలు చేస్తూ శంకర్‌రావు హైకోర్టుకు లేఖ రాశారనిచెప్పారు.

ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు వై.ఎస్‌.షర్మిల(YS Sharmila)పై ఏఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి(Ponnavolu sudhakar Reddy) మండిపడ్డారు. రాజకీయ లబ్ధి కోసం తనపై ఆమె అసత్య ఆరోపణలు చేశారన్నారు. ఆమె పచ్చి అబద్ధాలు అడుతున్నారని విమర్శించారు. తన వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగేలా షర్మిల మాట్లాడారని విమర్శించారు. కాంగ్రెస్‌ ఎమ్మెల్యే శంకర్‌రావు(Shankar Rao) కారణంగానే వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి(YS Rajasekhar Reddy) పేరును ఎఫ్‌ఐఆర్‌లో(FIR) చేర్చారని గుర్తు చేశారు. వైఎస్‌పై ఆరోపణలు చేస్తూ శంకర్‌రావు హైకోర్టుకు లేఖ రాశారనిచెప్పారు. దీనిపై హైకోర్టు విచారణకు ఆదేశించడం, తెలుగుదేశంపార్టీ నాయకుడు ఎర్రన్నాయుడు(Yerran Naidu) ఈ కేసులో ఇంప్లీడ్ అవ్వడం అందరికీ తెలిసిన విషయాలేనని పొన్నవోలు సుధాకర్‌రెడ్డి అన్నారు. 2011 ఆగస్టు 17వ తేదీన వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి, జగన్‌(Jagan) పేరు ఎఫ్‌ఐఆర్‌లో చేర్చారని తెలిపారు. ‘మహానుభావుడైన వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి మీద ఆరోపణలు చేస్తుంటే. అన్యాయంగా కేసులలో ఇరికిస్తుంటే అన్యాయమని భావించాను. అందుకే కేసులు వేశాను. అంతే తప్ప నాతో ఎవరూ కేసులు వేయించలేదు. ఆ సంగతి తెలుసుకొని షర్మిల మాట్లాడాలి. 2011 డిసెంబరులో నేను కేసు వేసే నాటికి కనీసం జగన్‌ను చూడనేలేదు. వైఎస్ఆర్ మీద కాంగ్రెస్(Congress) కేసు పెట్టటం భరించలేక నేను కేసు వేశాను. అప్పటి జీవోలకు, జగన్‌కు ఏం సంబంధం ఉంది?' అని పొన్నవోలు ప్రశ్నించారు. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డిని అన్యాయంగా కేసులో ఇరికించారనే బాధతోనే తాను బయటకు వచ్చానని, ఆయనపై కేసు పెట్టడం అనయాయమని వాదించానని తెలిపారు. షర్మిల చెప్పినట్టు తానే వైఎస్‌పై కేసు వేస్తే ఏ శిక్షకైనా సిద్ధమేనని చెప్పారు. సీబీఐ(CBI), కాంగ్రెస్ కలిసే వైఎస్‌ను ఇరికించారని, ఇది తాను నిరూపించటానికి సిద్ధమని తెలిపారు. వైఎస్‌ను వేధించిన వారికి ఎదురొడ్డి పోరాటం చేశానని, తనను అభినందించాల్సిందిపోయి ఆరోపణలు చేయటం ఏమిటని షర్మిలను ప్రశ్నించారు పొన్నవోలు సుధాకర్‌రెడ్డి.
చంద్రబాబు(Chandrababu) మాట్లాడిన మాటలు, భాషనే షర్మిల మాట్లాడుతున్నారని ఏఏజీ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Updated On 26 April 2024 8:14 AM GMT
Ehatv

Ehatv

Next Story