న్యూ ఇయర్ సెలబ్రేషన్స్((New Year Celebrations) పై పోలీసులు గట్టి నిఘా పెట్టారు. డ్రగ్స్, మత్తు పదార్థాల(drugs and intoxicants) నియంత్రణకు ఉక్కుపాదం మోపాలని తెలంగాణ ప్రభుత్వం ఆదేశింంచిన సంగతి తెలిసిందే. దీంతో..న్యూ ఇయర్ సందర్భంగా పోలీసులు పకడ్బందీగా చర్యలు చేపడుతున్నారు. ఈసారి..న్యూ ఇయర్ వేడుకల్లో డ్రగ్స్ వినియోగించినవారిని గుర్తించేందుకు అత్యాధునిక సాంకేతిక పరికరాలను..ప్రభుత్వం ప్రత్యేకంగా టీఎస్ న్యాబ్(TS NAB)కు అప్పగించింది. కోట్ల రూపాయలు వెచ్చించి కొనుగోలు చేసిన 'డ్రాగ్గర్' , 'అబొట్'('Dragger', 'Abbott') అనే ఈ పరికరాలతో స్పాట్లోనే.. డ్రగ్స్ వినియోగించారా లేదా? అన్న విషయాన్ని తేల్చేస్తారు.

new year celebrations
న్యూ ఇయర్ వేడులకపై నిఘా..అనుమానం వస్తే డ్రాగ్గర్ టెస్ట్ !
న్యూ ఇయర్ సెలబ్రేషన్స్((New Year Celebrations) పై పోలీసులు గట్టి నిఘా పెట్టారు. డ్రగ్స్, మత్తు పదార్థాల(drugs and intoxicants) నియంత్రణకు ఉక్కుపాదం మోపాలని తెలంగాణ ప్రభుత్వం ఆదేశింంచిన సంగతి తెలిసిందే. దీంతో..న్యూ ఇయర్ సందర్భంగా పోలీసులు పకడ్బందీగా చర్యలు చేపడుతున్నారు. ఈసారి..న్యూ ఇయర్ వేడుకల్లో డ్రగ్స్ వినియోగించినవారిని గుర్తించేందుకు అత్యాధునిక సాంకేతిక పరికరాలను..ప్రభుత్వం ప్రత్యేకంగా టీఎస్ న్యాబ్(TS NAB)కు అప్పగించింది. కోట్ల రూపాయలు వెచ్చించి కొనుగోలు చేసిన 'డ్రాగ్గర్' , 'అబొట్'('Dragger', 'Abbott') అనే ఈ పరికరాలతో స్పాట్లోనే.. డ్రగ్స్ వినియోగించారా లేదా? అన్న విషయాన్ని తేల్చేస్తారు. హైదరాబాద్(Hyderabad), సైబరాబాద్(Cyberabad), రాచకొండ కమిషనరేట్(Rachakonda Commissionerate)లకు 25 చొప్పున ఈ రెండు అత్యాధునిక పరికాలను అందజేశారు. న్యూ ఇయర్ సందర్భంగా పబ్(Pub), రిసార్ట్(resort), చౌరస్తాల దగ్గర వైద్యుల సమక్షంలోనే తనిఖీలు చేసి..గ్రడ్స్ వినియోగదారులను గుర్తిస్తారు. ఈ పరికరాలు డ్రగ్స్ వినియోగించిన వ్యక్తులను పక్కాగా గుర్తిస్తాయని పోలీస్ అధికారులు చెబుతున్నారు. నోటి నుంచి తీసిన లాలాజలం(Saliva), లేదా మూత్ర పరీక్ష(Urine tests)లు నిర్వహిస్తారు. ఇవన్నీ జంక్షన్లు(junctions), పబ్, రిసార్ట్‌ల దగ్గర స్పాట్లోనే తనిఖీలు చేపట్టి, అనుమానితులకు టెస్టులు చేస్తారు. దీని కోసం ఆయా ప్రాంతాల్లో మొబైల్ క్యాబిన్(Mobile cabins)లు ఏర్పాటు చేస్తున్నారు. ఇక వందల సంఖ్యలో డ్రంకన్ డ్రైవింగ్ చెక్ పోస్టులు(Drunk driving check posts) ఎలాగూ ఉంటాయి. డ్రగ్స్ అణచివేతకు ఇంత సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించడం ఇదే మొదటిసారి. ఇక డ్రగ్స్ వినియోగించి పట్టుబడిన వ్యక్తి విషయంలో చట్టం ఎంత కఠినంగా ఉంటుందదో అందరికీ తెలిసిన సంగతే ! సో..న్యూ ఇయర్ సందర్భంగా తస్మాత్ జాగ్రత్త అంటూ హెచ్చరిక జారీ చేస్తున్నారు పోలీసులు.
