కొత్త సంవత్సరం (New Year) వేళ తెలంగాణ నార్కొటిక్ పోలీసులు కొత్త, కొత్త నిర్ణయాలు తీసుకుంటున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ తరహాలోనే డ్రగ్ అండ్ డ్రైవ్ (Drug And Drive) టెస్టులు నిర్వహించాలని నార్కొటిక్ పోలీసులు నిర్ణయం తీసుకున్నారు
కొత్త సంవత్సరం (New Year) వేళ తెలంగాణ నార్కొటిక్ పోలీసులు కొత్త, కొత్త నిర్ణయాలు తీసుకుంటున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ తరహాలోనే డ్రగ్ అండ్ డ్రైవ్ (Drug And Drive) టెస్టులు నిర్వహించాలని నార్కొటిక్ పోలీసులు నిర్ణయం తీసుకున్నారు. డ్రగ్ డిటెక్షన్ టెస్ట్ కిట్లను ((Drug Detection Kits) తెప్పించిన పోలీసులు రేపటి నుంచి ఈ పరీక్షల చేయడానికి నార్కొటిక్ బ్యూరో (Narcotics Bureau) సిద్ధమవుతోంది. ఇందుకుగాను ఇప్పటికే వీటికి సంబంధించిన కిట్స్ తెప్పించారు. నోటి లాలాజలంతో పాటు అవసరమైతే యూరిన్ (Urine) పరీక్షలు కూడా చేయనున్నారు. బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేసిన తర్వాత పాజిటివ్ వస్తే.. కచ్చితమైన నిర్ధారణ కోసం మూత్ర పరీక్షలు చేయనున్నారు.