అనుమతులు లేకుండా స్పా సెంటర్లు (Spa Centers) నడుపుతూ క్రాస్ మసాజ్‌ (Cross Massage) చేస్తున్న పలువురిని అరెస్ట్‌ చేశారు. గుడిమల్కాపూర్‌ (Gudimalkapur) పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని పలు స్పా సెంటర్లపై పోలీసులు దాడులు నిర్వహిచారు.

అనుమతులు లేకుండా స్పా సెంటర్లు (Spa Centers) నడుపుతూ క్రాస్ మసాజ్‌ (Cross Massage) చేస్తున్న పలువురిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. గుడిమల్కాపూర్‌ (Gudimalkapur) పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని పలు స్పా సెంటర్లపై పోలీసులు దాడులు నిర్వహిచారు. సౌత్ వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ (South West Jone Taskforce) పోలీసులు, గుడిమాల్కాపుర్ పోలీసులు సంయుక్తంగా కలిసి నానల్‌నగర్ (Nanal Nagar) చౌరస్తాలో ఉన్న ఓ అపార్ట్‌మెంట్‌లో జన్నత్ గోల్డెన్ (Jannath Golden) అనే రెండు స్పా సెంటర్ల పై దాడి చేశారు.

క్రాస్ మసాజ్ చేస్తున్న 5 మంది అమ్మాయిలతో పాటు ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. స్పా ముసుగులో వ్యభిచారం (Prostitution) నిర్వహిస్తున్నారని పోలీసులు అనుమానిస్తున్నారు. దీంతో భవన యజమానులకు పోలీసులు పలు సూచనలు చేస్తున్నారు. అనుమతులు లేకుండా స్పా సెంటర్లు నడిపిస్తున్న భవనాల యజమానులు వారిని వెంటనే ఖాళీ చేయించాలని పోలీసులు హెచ్చరించారు. ఇలాంటి స్పా సెంటర్లు నడుపుతున్నవారితో పాటు భవన యజమానులపై కూడా చర్యలు తీసుకోవాల్సి వస్తుందని గుడిమల్కాపూర్‌ సీఐ ముజీబ్‌ రెహ్మాన్‌ (Muzib Rehman) హెచ్చరించారు. యువత ఎవరూ స్పా సెంటర్లకు, స్నూకర్ సెంటర్లకు, రిక్రియేషన్‌ క్లబ్‌లకు వెళ్తే కేసులు నమోదు చేస్తామని ఆయన హెచ్చరించారు.

Updated On 6 Jan 2024 12:42 AM GMT
Ehatv

Ehatv

Next Story