American Airlines : విమానాల్లో మైనర్లే అతడి టార్గెట్.. టాయిలెట్లలో సీక్రెట్ కెమెరా..!
విమానాల్లో(Airplane) ప్రయాణించే మైనర్ బాలికలను(Minor girls) లక్ష్యంగా చేసుకుని టాయిలెట్లలో(Toilet) సీక్రెట్ కెమెరాలు(Secrete camera) పెడుతున్న ఎయిర్‌లైన్స్ ఉద్యోగిని పోలీసులు అరెస్ట్ చేశారు. గత ఏడాది ఆగస్ట్- జనవరి మధ్య కాలంలో 7, 9, 11, 13 ఏళ్ల వయసున్న నలుగురు బాలికలు టాయిలెట్‌కు వెళ్లగా వారిని చిత్రీకరించినట్లు బయటపడింది. అతని ఐక్లౌడ్ అకౌంట్‌లో చైల్డ్ పోర్నోగ్రఫీకి(Child pornography) చెందిన వీడియోలు కూడా బయటపడ్డాయి. ఆలస్యంగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
విమానాల్లో(Airplane) ప్రయాణించే మైనర్ బాలికలను(Minor girls) లక్ష్యంగా చేసుకుని టాయిలెట్లలో(Toilet) సీక్రెట్ కెమెరాలు(Secrete camera) పెడుతున్న ఎయిర్‌లైన్స్ ఉద్యోగిని పోలీసులు అరెస్ట్ చేశారు. గత ఏడాది ఆగస్ట్- జనవరి మధ్య కాలంలో 7, 9, 11, 13 ఏళ్ల వయసున్న నలుగురు బాలికలు టాయిలెట్‌కు వెళ్లగా వారిని చిత్రీకరించినట్లు బయటపడింది. అతని ఐక్లౌడ్ అకౌంట్‌లో చైల్డ్ పోర్నోగ్రఫీకి(Child pornography) చెందిన వీడియోలు కూడా బయటపడ్డాయి. ఆలస్యంగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
గతేడాదని సెప్టెంబర్‌లో అమెరికాకు చెందిన ఎయిర్‌లైన్స్(American airlines) నార్త్ కరోలినాలోని షార్లెట్ నుంచి బోస్టన్‌కు వెళ్తుండగా ఓ ఘటన జరిగింది. విమానంలో అటెండెంట్‌గా పనిచేస్తున్న ఎస్టెస్ కార్టర్ థామ్సన్ అనే 34 ఏళ్ల వ్యక్తి ఈ చర్యకు పాల్పడినట్లు తేలింది. మైనర్ బాలికలు బాత్రూంలోకి వెళ్లిన సమయంలో రహస్యంగా తన ఫోన్‌లో రికార్డు చేస్తున్నట్లు గుర్తించారు. 14 ఏళ్ల ఓ మైనర్ బాలిక టాయిలెట్‌కి వెళ్లడంతో అక్కడ ఉన్న బాత్రూమ్ బాలేదని చెప్పి ఫస్ట్ క్లాస్ సెక్షన్‌లోని బాత్రూమ్‌కు నిందితుడు పంపించాడు. ఆ బాత్‌రూంలో ముందుగానే తన సెల్‌ఫోన్‌ను టేపుతో గోడకు అంటించి ఉంచాడు. ఆ టాయిలెట్‌లోకి వెళ్లిన బాలిక అక్కడ సెల్‌ఫోన్‌ను గుర్తించి తన తల్లిదండ్రులకు తెలిపింది. దీంతో బాధిత కుటుంబం ఈ ఘటనపై సిబ్బందికి ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి దిగిన అధికారులు విచారణ చేపట్టగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. తొమ్మిదేళ్ల బాలిక సహా నలుగురు మైనర్లను నిందితుడు ఈ రకంగా సెల్‌ఫోన్‌లో రికార్డ్ చేశాడని తేలింది. గతేడాది జనవరి- ఆగస్టు మధ్యన 7, 9, 11, 13 ఏళ్ల వయసున్న నలుగురు చిన్నారులను సీక్రెట్‌గా రికార్డు చేసినట్టు వెల్లడైంది. నిందితుడిపై లైంగిక వేధింపులు, చైల్డ్ పోర్నోగ్రఫీ నేరాల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. జనవరి 18న నిందితుడిని అరెస్ట్ చేశారు. అంతేకాకుండా ఎయిర్‌లైన్స్ సంస్థపై కూడా కేసు నమోదు చేశారు.