ఫ్రాన్స్‌కు(france) వెళ్లిన వారు పారిస్‌లో(Paris) ఉన్న ఈఫిల్‌ టవర్‌ను(Eiffel Tower) చూడకుండా రారు. పారిస్‌కు అదో అందం.. ఆకర్షణ. అందుకే ప్రపంచం నలుమూలల నుంచి టూరిస్టులు ఈఫిల్‌ టవర్‌ను చూసేందుకు వస్తారు. ఈఫిల్‌ టవర్‌ నిర్మాణం 1887లో మొదలయ్యి 1889లో పూర్తయింది. అప్పుడు ఫ్రాన్స్‌లో నిర్వహించిన వరల్డ్‌ ఎగ్జిబిషన్‌కు ఎంట్రీ గేట్‌గా దీన్ని నిర్మించారు.

ఫ్రాన్స్‌కు(france) వెళ్లిన వారు పారిస్‌లో(Paris) ఉన్న ఈఫిల్‌ టవర్‌ను(Eiffel Tower) చూడకుండా రారు. పారిస్‌కు అదో అందం.. ఆకర్షణ. అందుకే ప్రపంచం నలుమూలల నుంచి టూరిస్టులు ఈఫిల్‌ టవర్‌ను చూసేందుకు వస్తారు. ఈఫిల్‌ టవర్‌ నిర్మాణం 1887లో మొదలయ్యి 1889లో పూర్తయింది. అప్పుడు ఫ్రాన్స్‌లో నిర్వహించిన వరల్డ్‌ ఎగ్జిబిషన్‌కు ఎంట్రీ గేట్‌గా దీన్ని నిర్మించారు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన టవర్‌ రూపంలో నిర్మించిన ఈ కట్టడాన్ని తర్వాత కూల్చివేయాలనుకున్నారు. కాకపోతే టవర్‌ను చూసేందుకు జనాలు తరలి వస్తుండటంతో కూల్చివేయాలన్న ఆలోచనను విరమించుకున్నారు. దీని నిర్మాణానికి రెండేళ్ల రెండు నెలల అయిదు రోజుల సమయం పట్టింది.

నిర్మాణంలో 300 మంది కూలీల శ్రమ ఉంది. అసలు పారిస్‌కు టూరిస్టులు వస్తున్నారంటే అందుకు కారణం ఈఫిల్‌ టవరే! ఇంత అందమైన కట్టడాన్ని రాత్రిపూట(Night time) కెమెరాలో(Photo Capture) బంధించాలని ప్రయత్నించారే అనుకోండి.. మీరు బందీలవుతారు. ఎందుకంటే ఈఫిల్‌ టవర్‌ను రాత్రివేళ ఫోటోలు తీయడం నిషేధం. అది నేరం. అందుకు కారణం ఈఫిల్‌ టవర్‌ లైట్లు పారిస్‌ కాపీరైట్స్‌(Copy rights) కిందకు వస్తాయి. ఎవరైనా రాత్రిపూట టవర్‌ ఫోటోలు తీయాలనుకుంటే మాత్రం ముందుగా కాపీరైట్‌ చట్టానికి అనుగుణంగా ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవాలి. చలికాలంలో ఈఫిల్‌ టవర్‌లోని కొంత భాగం ముడుచుకుపోతుంటుంది. వేసవిలో మళ్లీ సాధారణ స్థాయికి వస్తుంది. నిజానికి ఈఫిల్‌ టవర్‌ను 20 ఏళ్ల పాటు ఉండేలా నిర్మించారు కానీ 20 ఏళ్లు దాటినా చెక్కుచెదరకుండా ఉండటంతో ఎప్పటికప్పుడు మరమత్తులు చేస్తూ నిత్యనూతనంగా ఉంచుతున్నారు. 20 ఏళ్ల తర్వాత కొన్ని సాంకేతిక పరీక్షలు చేస్తే టవర్‌ ఎంతో స్ట్రాంగ్‌గా ఉందని తేలింది.

Updated On 22 July 2023 1:51 AM GMT
Ehatv

Ehatv

Next Story