గ్రహాంతరవాసులు(Aliens) ఉన్నారా? ఉంటే మనపై ఓ కన్నేసి ఉంచారా? అప్పుడప్పుడు భూమ్మీదకు వచ్చి వెళుతున్నారా? ఈ ప్రశ్నలకు ఖగోళ శాస్త్రవేత్తల దగ్గర స్పష్టమైన జవాబులు లేవు కానీ ఎక్కడో ఉండే ఉంటారని గట్టిగా నమ్ముతున్నారు. గ్రహాంతరవాసుల గురించి చాన్నాళ్లుగా చర్చ జరుగుతోంది. ఈ అనంతానంత విశ్వంలో భూమిని పోలిన గ్రహాలు వందలకొద్దీ ఉంటాయని, వాటిల్లో మనలాంటి జీవులు ఉండే ఉంటారని కొందరు సైంటిస్టులు విశ్వసిస్తున్నారు. అబ్బే ఏలియన్స్‌ అంటూ ఎవరు లేరని మరికొందరు అంటున్నారు.

కానీ కొన్ని యధార్థ సంఘటనలను పరికిస్తే ఏలియన్స్‌ అసత్యం కాదని అనిపిస్తోంది. లేటెస్ట్‌గా పెరూ దేశంలో(Peru) జరిగిన సంఘటన ఏలియన్స్‌ ఉనికిని చెబుతోంది. పెరూలోని ఈశాన్య ప్రాంతంలో ఉన్న ఆల్టో నానే(alto nane) జిల్లాలో ఓ ఉదంతం వెలుగు చూసింది. డైలీ స్టార్‌ మీడియా తెలిపిన వివరాల ప్రకారం 15 ఏళ్ల ఓ బాలిక గ్రహాంతరవాసులను చూసిందట! వారిని చూసి జడుసుకుందట! ఆ బాలికపై ఆ వింత జీవులు దాడికి దిగాయట! ప్రస్తుతం ఆ పాప ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. ఆ గ్రహాంతరవాసులు ఏడు అడుగుల పొడవు ఉన్నారట! వాటి కళ్లు పసుపుపచ్చ రంగులో ఉన్నాయట! ఆ వింత జీవులను చూస్తే ఎవరైనా భయంతో వణికిపోవాల్సిందేనని స్థానికులు అంటున్నారు.

గత కొంత కాలంలో నల్లటి హుడీలు(Black Hoodie) ధరించిన ఈ ఏలియన్లు ప్రజలపై దాడులు చేస్తున్నాయని ఇక్విటు అనే స్థానికుడు అంటున్నాడు. అలాగే ఇక్కడి గిరిజన(Tribal) ప్రాంతంలో నివసించే ఇకూటి(Ikuti) జాతి ‍ప్రజలు కూడా హఠాత్తుగా ప్రజల్లోకి వచ్చి దాడి చేసి పారిపోతున్నారన్నాడు. ఎదుటివారి ముఖాన్నే టార్గెట్‌ చేస్తుండటం ఆందోళన కలిగిస్తున్నదని ఇక్విటు చెప్పాడు. నెల రోజుల క్రితం ఆల్టో నానే జిల్లాలో మొదటి సారిగా వింత జాతి జీవులు కనిపించాయని అంటున్నారు.

వారి దాడుల కారణంగా బాలిక గాయాలతో ఆసుపత్రిలో చేరింది. ఈ అమ్మాయి గ్రహాంతరవాసులను చూసి భయపడిపోయిందని స్థానికులు చెబుతున్నారు. ఇంతకీ వారు గ్రహాంతరవాసులేనా? లేక ఆ వేషంతో వస్తున్న ఇకూటి జాతి ప్రజలా అన్నది ఎవరూ స్పష్టంగా చెప్పలేకపోతున్నారు.
మరికొందరు హుడీ ధరించిన ఇలాంటి జీవిని తమ జీవితంలో ఎప్పుడూ కూడా చూడలేదని అంటున్నారు. ఆందోళన కలిగించే విషయమేమిటంటే ఆ వింతజీవులు చాలా ప్రమాదకరంగా ప్రవర్తించడం.

గ్రహాంతరవాసులుగా కనిపించినవారు ఆ బాలిక మెడపై గాయం చేశారని ఆల్టో నానే జిల్లాకు చెందిన గిరిజన నాయకుడు జైరో రెటెగుయ్ దవిలా చెప్పాడు. దీంతో రాత్రిపూట తాము పహారా కాయాల్సి వస్తున్నదని, స్థానికులను రక్షించాల్సిన పరిస్థితి నెలకొందని తెలిపాడు. ఈ వింతజీవులు రాత్రిపూట మాత్రమే బయటకు వస్తుండటంతో, వారి రూపాన్ని సరిగా గుర్తించలేకపోతున్నామన్నాడు. ముఖ్యంగా మహిళలు, పిల్లలను లక్ష్యంగా చేసుకుని వారు దాడులకు తెగబడుతున్నారని జైరో రెటుగుయ్‌ దవిలా వివరించాడు.

Updated On 12 Aug 2023 2:30 AM GMT
Ehatv

Ehatv

Next Story