High Speed Rail Corridor : హైదరాబాద్ టు వైజాగ్..హైస్పీడ్ రైల్ కారిడార్
హైదరాబాద్(Hyderabad) నుంచి విశాఖపట్టణం(Vizag) వరకు విజయవాడ మీదుగా జాతీయ రహదారి వెంట హైస్పీడ్ రైలు కారిడార్(High Speed Rail Corridor) ఏర్పాటుకు వేగంగా అడుగులు పడుతున్నాయి. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రైల్వే శాఖ ప్రిలిమినరీ ఇంజనీరింగ్ అండ్ ట్రాఫిక్ (PEAT) సర్వే చేపట్టింది
హైదరాబాద్(Hyderabad) నుంచి విశాఖపట్టణం(Vizag) వరకు విజయవాడ మీదుగా జాతీయ రహదారి వెంట హైస్పీడ్ రైలు కారిడార్(High Speed Rail Corridor) ఏర్పాటుకు వేగంగా అడుగులు పడుతున్నాయి. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రైల్వే శాఖ ప్రిలిమినరీ ఇంజనీరింగ్ అండ్ ట్రాఫిక్ (PEAT) సర్వే చేపట్టింది. ఇందుకు సంబంధించిన బాధ్యతలను గత సంవత్సరం మే నెల లోనే ఎస్‌ఎం కన్సల్టెన్సీకి అప్పగించింది. మార్చి నెలాఖరు నాటికి ప్రాథమిక సర్వే(Primary survey) పూర్తి చేయనున్నట్ల తెలుస్తోంది. ఈ సర్వే ఆధారంగా సమగ్ర నివేదిక (డీపీఆర్) రూపొందించనున్నారు. దీని వల్ల రంగారెడ్డి(Valla Ranga Reddy), ఉమ్మడి నల్లగొండ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోని కృష్ణా జిల్లాలో జాతీయ రహదారి వెంట ఉన్న ప్రాంతవాసుల రైలు కల సాకారం అవుతుంది.