Brittish Woman To Pakistan : లవర్ కోసం పాకిస్తాన్‌కు వచ్చిన బ్రిటన్ మహిళ..పోలీసులకు చుక్కలు కనిపించాయి!
ఈ మధ్యన సరిహద్దులు దాటుతున్న ప్రేమలు ఎక్కువయ్యాయి. సోషల్ మీడియా ద్వారా ఏర్పడిన పరిచయం ప్రేమగా ముదిరి సరిహద్దులు దాటేలా చేస్తోంది. మొన్న పాకిస్తాన్‌కు చెందిన సీమా హైదర్(Seema Haidher) అనే మహిళ ఉత్తరప్రదేశ్‌లో ఉన్న సచిన్(Sachin) అనే యువకుడి కోసం అక్రమంగా భారత్‌కు చేరిన విషయం తెలుసు కదా! నిన్నటికి నిన్న రాజస్థాన్‌కు చెందిన అంజు పాకిస్తాన్‌కు చెందిన సస్రుల్లా ప్రేమలో పడి ఆ దేశానికి వెళ్లిన వైనాన్ని చూశాం!

Brittish Woman To Pakistan

ఇప్పుడు ఇలాంటి ప్రేమ కథలు సోషల్ మీడియాలో కుప్పలు తెప్పలుగా వస్తున్నాయి. అయితే అందులో వాస్తవాలేమిటో తెలియదు. లేటెస్ట్‌గా పాకిస్తాన్ పోలీసులు ఖైబర్ ఫఖ్తూన్‌ఖ్వాకు(Khyber Pakhtunkhwa) చెందిన ఓ వ్యక్తిని అరెస్ట్ చేశారు. సోషల్ మీడియాలో ఫేక్ పోస్ట్ పెట్టడన్న ఆరోపణలతో అతడిపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు.
ఆ పోస్టులో ఓ మహిళ తన ప్రేమికుడితో పాటు ఉండేందుకు ఇక్కడికి వచ్చిందని తెలిపారు. ఎంక్వైరీ చేస్తే అతడి కథనంలో నిజం లేదని తేలింది. ముహమ్మద్ గులాబ్(Muhammad Gulab) అనే వ్యక్తి సోషల్ మీడియాలో పెట్టిన ఓ పోస్టులో ఇలా అనే ఒక బ్రిటిష్ మహిళ తన ప్రియుడితో పాటు ఉండేందుకు సలార్ జై వచ్చిందని పేర్కొన్నాడు. కేవలం ఫన్నీ కోసమే అతగాడు ఆ పోస్టు షేర్ చేశాడు. ఈ పోస్టును చూసిన పోలీసులు వెంటనే అలెర్టయ్యారు.
ఆ వ్యక్తి పేర్కొన్న అడ్రస్‌కు వెళ్లి ఎంక్వైరీ చేశారు. అక్కడ ఎవరూ లేకపోవడం చూసి ఆశ్చర్యంతో పాటు కోపం కూడా తెచ్చుకున్నారు. ఈ ఫేక్‌పోస్ట్ క్రియేట్ చేసినందుకు ముహమ్మద్ గులాబ్‌పై కేసు పెట్టారు. అతడిని కటకటాల వెనక్కి నెట్టారు. అయితే స్థానికుల సపోర్ట్ మాత్రం ముహమ్మద్‌కు పుష్కలంగా ఉంది. సోషల్ మీడియాలో ఇలాంటి పోస్టులు సర్వసాధారణమేనని వారు వాదిస్తున్నారు. కాగా, కొద్ది రోజుల కిందట పాక్‌కు చెందిన సీమా హైదర్ తన భారతీయ ప్రేమికుడి కోసం నేపాల్ గుండా అక్రమంగా ఇండియాలోకి అడుగుపెట్టింది. ఆమె నిజంగానే ప్రేమ కోసం ఇక్కడికి వచ్చిందా? లేక ఇక్కడి రహస్యాలు తెలుసుకోడానికి పాక్ ప్రభుత్వమే పంచించిందా అన్నది తేలాల్సి ఉంది. ప్రస్తుతం పోలీసులు ఆమెను విచారిస్తున్నారు.