తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల్లో ముఖ్యమైంది రూ.500కే సిలిండర్. మహాలక్ష్మి పథకంలో భాగంగా రూ.500కే గ్యాస్ సిలిండర్‌ను అమలు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కార్యాచరణ రూపొందించింది. ఇందులో భాగంగా గ్యాస్ రాయితీ విషయంపై పౌర సరఫరాల శాఖ అర్హుల జాబితాకు సంబంధించిన విధి విధానాలను రూపొందించింది.
తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల్లో ముఖ్యమైంది రూ.500కే సిలిండర్. మహాలక్ష్మి పథకంలో భాగంగా రూ.500కే గ్యాస్ సిలిండర్‌ను అమలు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కార్యాచరణ రూపొందించింది. ఇందులో భాగంగా గ్యాస్ రాయితీ విషయంపై పౌర సరఫరాల శాఖ అర్హుల జాబితాకు సంబంధించిన విధి విధానాలను రూపొందించింది. ఏడాదికి ఎవరికి ఎన్ని సిలిండర్లకు సబ్సిడీ ఇవ్వాలన్న విషయంపై అధికారులు లెక్కలు సిద్ధం చేశారు
రూ.500 గ్యాస్ సిలిండర్ పథకానికి అర్హులైన వారిని ఎంపిక చేసేందుకు ఆ కుటుంబం ఏడాదికి ఎన్ని సిలిండర్లు వాడింది.. అలా మూడు సంవత్సరాల వినియోగాన్ని పరిగణనలోకి తీసుకుంది. ఈ లెక్కన ఏటా గరిష్ఠంగా ఇవ్వాల్సిన సిలిండర్ల సంఖ్య 8 (Eight)గా తేలింది. మహాలక్ష్మి పథకానికి తొలుత 39.78 లక్షల మందిని అర్హులుగా పౌర సరఫరాల శాఖ తేల్చింది. ఆ తర్వాత కొంత తగ్గి 39.50 లక్షలకు చేరింది. వీరిలో దాదాపు 9 లక్షల మంది అత్యధికంగా ఏడాదికి గరిష్టంగా 8 సిలిండర్లు వాడినట్లు గుర్తించారు. దీంతో ఈ పథకంలో సబ్సిడీపై గరిష్టంగా ఇవ్వబోయే సిలిండర్లు సంఖ్య '8'గా తేల్చారు. కానీ కొసమెరుపు ఏంటంటే సబ్సిడీ పొందే కుటుంబాలు ముందుగా సిలిండర్‌కు అయ్యే మొత్తాన్ని చెల్లించాల్సిందే. ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీని వినియోగదారుల ఖాతాల్లో ప్రభుత్వం చెల్లించనుంది. ఈ పథకానికి రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సిన సబ్సిడీ నెలకు రూ.71.27 కోట్లు అవుతుందని అధికారులు అంచనా వేశారు. ఏడాదికి రూ.855 కోట్లు అవుతుందని తేల్చారు. అయితే తెలంగాణలో ఉజ్వల (Ujwala) కనెక్షన్ వినియోగదారులు 11.58 లక్షల మంది ఉండగా సబ్సిడీ కోసం దరఖాస్తు చేసుకున్నవారు మాత్రం 5.89 లక్షల మంది ఉండడంతో వారికి కేంద్ర ప్రభుత్వమే 5.89 లక్షల మందికి రూ.340 సబ్సిడీ వస్తుంది. ఈ ఉజ్వల కనెక్షన్లకు రాష్ట్రం రూ.155 చొప్పున సబ్సిడీ భరిస్తే చాలు.