పొట్ట చేత పట్టుకుని దేశం కాని దేశానికి వలస వెళ్లడమే దుర్భరం. అలాంటి పరిస్థితుల్లోకి ప్రజలను నెట్టివేయడ దేశాల దౌర్భాగ్యం. పాపం ఎంత కష్టమొచ్చిందో ఏమో కానీ నైజీరియాకు(Nigeria) చెందిన నలుగురు వలసదారులు ప్రాణాలు పణంగా పెట్టి సాహసయాత్ర చేశారు. 14 రోజులపాటు కార్గోషిప్‌(cargo ship) అడుగున ముందు భాగంలో ఉండే చుక్కానిపై కూర్చొని బ్రెజిల్(Brazil) చేరుకున్నారు. యూరప్‌కు(Europe) చేరుకోవాలన్నది వారి లక్ష్యం. ఆ తపనతోనే అక్రమంగా అలా చుక్కానిపైకి ఎక్కి కూర్చున్నారు.

పొట్ట చేత పట్టుకుని దేశం కాని దేశానికి వలస వెళ్లడమే దుర్భరం. అలాంటి పరిస్థితుల్లోకి ప్రజలను నెట్టివేయడ దేశాల దౌర్భాగ్యం. పాపం ఎంత కష్టమొచ్చిందో ఏమో కానీ నైజీరియాకు(Nigeria) చెందిన నలుగురు వలసదారులు ప్రాణాలు పణంగా పెట్టి సాహసయాత్ర చేశారు. 14 రోజులపాటు కార్గోషిప్‌(cargo ship) అడుగున ముందు భాగంలో ఉండే చుక్కానిపై కూర్చొని బ్రెజిల్(Brazil) చేరుకున్నారు. యూరప్‌కు(Europe) చేరుకోవాలన్నది వారి లక్ష్యం. ఆ తపనతోనే అక్రమంగా అలా చుక్కానిపైకి ఎక్కి కూర్చున్నారు. అట్లాంటిక్‌ మహా సముద్రంవైపుగా కదిలిన ఆ నౌక యూరప్‌కు కాకుండా బ్రెజిల్‌వైపుకు కదిలింది. ఆ నలుగురికి నౌక ఎటు వెళుతున్నదో కూడా తెలియదు. దివారాత్రాలు ఆ చిన్ని స్థలంలో ఇరుక్కుని కూర్చుండిపోయారు. ఆకలిదప్పులు బాధిస్తున్నా, కడుపులో పేగులు నులిపెడుతున్నా భరించి అలాగే కూర్చున్నారు. 14 రోజుల పాటు మహా సముద్రంలో 5,600 కిలోమీటర్లు ప్రయాణించిన ఆ భారీ నౌక బ్రెజిల్ పోర్డుకు చేరుకుంది. ఓడ బ్రెజిల్‌ చేరుకున్న తర్వాత దయనీయ స్థితిలో చుక్కానిపై కూర్చుని ఉనన నలుగురిని అధికారులు గుర్తించారు. వారిని జాగ్రత్తగా కిందకు దించారు. వారి పరిస్థితి చూసి చలించిపోయారు.

ఆహారమిచ్చి ఆశ్రయమిచ్చారు. నలుగురు వలసదారులలో ఇద్దరు మాత్రం తమ దేశానికి వెళ్లిపోతామన్నారు. వారిని జాగ్రత్తగా నైజీరియాకు పంపించారు. మరో ఇద్దరు మాత్రం బ్రెజిల్‌లోనే ఉండిపోయారు. భయంకరమైన పరిస్థితులను తట్టుకుంటూ చుక్కాని మీద కూర్చుని ప్రయాణించడం దుస్సాహసమే! పెద్ద పెద్ద తిమింగలాలు వారికి దగ్గర వెళ్లేవట! వాటిని చూస్తే భయమేసేదట! ఓ పక్క మహా సముద్రం. మరోపక్క నౌక ఇంజిన్‌ చేసే శబ్దం. ఆ పద్నాలుగు రోజులు కంటిమీద కునుకు లేకుండా గడిపారు. దాహం వేసినప్పుడు సముద్రం నీళ్లనే తాగేవాళ్లమని చెప్పారు. ఓడ సిబ్బందికి కనిపిస్తే వారు ఎక్కడ సముద్రంలో పడదోస్తారనే భయంతో అలాగే వుండిపోయామని ఆ నలుగురు తమ అనుభవాలను చెప్పుకుంటూ ఆవేదన చెందారు. నైజీరియాలో ఆర్ధిక పరిస్థితి బాగోలేదు. రాజకీయ అస్థిరత ఆ దేశాన్ని వెంటాడుతోంది. అందుకే తాము వలస వెళ్లాలని అనుకున్నామని చెప్పుకొచ్చారు. సావో పాలోలో వారికి ఆశ్రయమిచ్చిన వ్యక్తి కూడా ఈ నలుగురి సాహస యాత్ర విని ఆశ్చర్యపోయాడు.

Updated On 2 Aug 2023 1:22 AM GMT
Ehatv

Ehatv

Next Story