North Korea : మొన్న చైనా, నిన్న రష్యా, ఇప్పుడు ఉత్తర కొరియా.. పిల్లల్ని కనండి ప్లీజ్...!
మొన్న చైనా(China), నిన్న రష్యా(Russia), ఇప్పుడు ఉత్తర కొరియా(North Korea) .. రిక్వెస్ట్‌ల మీద రిక్వెస్టులు చేస్తున్నాయి. ఏమిటా రిక్వెస్టంటే.. ఎక్కువమంది పిల్లల్ని(Children) కనమని! దేశాన్ని బలోపేతం చేయాలంటే జనాభా పెరగాలని, జననాలను పెంచడం మహిళల విధి అని ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్(Kim Jong Un) సెలవిచ్చారు.
మొన్న చైనా(China), నిన్న రష్యా(Russia), ఇప్పుడు ఉత్తర కొరియా(North Korea) .. రిక్వెస్ట్‌ల మీద రిక్వెస్టులు చేస్తున్నాయి. ఏమిటా రిక్వెస్టంటే.. ఎక్కువమంది పిల్లల్ని(Children) కనమని! దేశాన్ని బలోపేతం చేయాలంటే జనాభా పెరగాలని, జననాలను పెంచడం మహిళల విధి అని ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్(Kim Jong Un) సెలవిచ్చారు. మొన్న ఆదివారం నేషనల్ మదర్స్ మీటింగ్(National Mother Meeting) జరిగింది. అందులో కిమ్ మాట్లాడాడు. ఎక్కువ మంది పిల్లలను కనాలని మహిళలకు విన్నవించుకున్నాడు. జననాల రేటు పెంచడం, చిన్నారుల సంరక్షణ, విద్య అన్నవి తల్లలు వల్లే సాధ్యమవుతాయని కిమ్ నొక్కి వక్కాణించారు. ఇంత చెబుతున్నాడు కానీ దేశ జనాభా లెక్కలను మాత్రం చెప్పడం లేదాయన! అసలు ప్రభుత్వానికి జనాభా గణాంకాలపై ఖాతరు లేదు. కాకపోతే అక్కడ పదేళ్లుగా జననాల రేటు తగ్గుతూ వస్తున్నదని దక్షిణ కొరియా అంటోంది. ఉత్తర కొరియాలో పిల్ల ల పెంపకం, వారికి విద్యాబుద్ధులు చెప్పడం వంటికి సామాన్యుల వల్ల కావడం లేదు. డబ్బున్నవారు మాత్రమే తట్టుకోగలుగుతున్నారు. అందుకే చాలా కుటుంబాలు ఒకరి కంటే ఎక్కువ మంది పిల్లలను కనడానికి ఇష్టపడటంలేదు.