స్కిల్‌ స్కాం(Skill Scam) కేసులో తెలుగుదేశంపార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు(Chandrababu naidu) బిగ్‌షాక్ తగిలింది. సుప్రీంకోర్టులో ఆయనకు ఎలాంటి ఊరట దక్కలేదు. చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్‌ పిటిషన్‌పై సుప్రీంకోర్టు(Supreme court) ద్విసభ్య ధర్మాసనం భిన్న తీర్పులు వెలువరిచింది. ఇద్దరు న్యాయమూర్తులు కూడా రిమాండ్‌ కొట్టేయలేమని చెప్పడం చంద్రబాబు భారీ షాక్‌ (Shock)లాంటిది.

స్కిల్‌ స్కాం(Skill Scam) కేసులో తెలుగుదేశంపార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు(Chandrababu naidu) బిగ్‌షాక్ తగిలింది. సుప్రీంకోర్టులో ఆయనకు ఎలాంటి ఊరట దక్కలేదు. చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్‌ పిటిషన్‌పై సుప్రీంకోర్టు(Supreme court) ద్విసభ్య ధర్మాసనం భిన్న తీర్పులు వెలువరిచింది. ఇద్దరు న్యాయమూర్తులు కూడా రిమాండ్‌ కొట్టేయలేమని చెప్పడం చంద్రబాబు భారీ షాక్‌ (Shock)లాంటిది. రిమాండ్‌ విధించే అధికారం ట్రయల్‌ కోర్టు అంటే విజయవాడలోని(Vijayawada) ఏసీబీ కోర్టుకు పూర్తిగా ఉందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. స్కిల్‌ కేసులో చంద్రబాబుకు అవినీతి నిరోధక శాఖలోని(ACB) సెక్షన్‌ 17-ఏ వర్తిస్తుందని జస్టిస్‌ అనిరుద్ధబోస్‌ తీర్పు ఇవ్వగా, 17-ఏ వర్తించదని జస్టిస్‌ బేలా ఎం.త్రివేది తీర్పు ప్రకటించారు. 'ఈ కేసులో 17ఏ వర్తిస్తుంది. చంద్రబాబు కేసులో విచారణకు ముందే గవర్నర్‌(Governor) అనుమతి తీసుకోవాల్సింది. గతంలో జరిగిన దర్యాప్తును ఈ అరెస్ట్‌కు వర్తింపజేయరాదు. అయినా చంద్రబాబుకు విధించిన రిమాండ్‌ ఆర్డర్‌ను(Remand Order) కొట్టేయలేం. అనుమతి లేనంత మాత్రాన రిమాండ్‌ ఆర్డర్‌ నిర్వీర్యం కాదు' అని జస్టిస్‌ బోస్‌(Justice bose) తీర్పు చెప్పారు. అయితే జస్టిస్‌ బేలా త్రివేది ఈ తీర్పుతో విభేదించారు. 'చంద్రబాబు పిటిషన్‌కు 17ఏ వర్తించదు. 2018లో వచ్చిన సవరణ ఆధారంగా చేసుకుని కేసును క్వాష్‌ చేయలేము. 2018లో వచ్చిన సవరణ కేవలం తేదీకి సంబంధించినది మాత్రమే. అవినీతి నిరోధక చట్టానికి 17ఏను ముడిపెట్టలేము. అధికారాన్ని అడ్డుపెట్టుకుని నేరానికి పాల్పడిన వారికి 17ఏ రక్షణగా ఉండకూడదు. అవినీతి నిరోధక చట్టంలో ఇచ్చిన మినహాయింపు కేవలం ఉద్యోగులు కక్ష్యసాధింపుకు గురి కావద్దని మాత్రమే' అని జస్టిస్‌ బేలా త్రివేది(Justice bela trivedi) చెప్పారు. తదుపరి నిర్ణయం కోస సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్‌కు నివేదించారు. ముగ్గురు లేదా అయిదుగురు జడ్జిల బెంచ్‌కు కేసు వెళ్లే అవకాశం ఉంది.

Updated On 16 Jan 2024 3:44 AM GMT
Ehatv

Ehatv

Next Story