Terrarist Attacks: ముంబైలో ఉగ్ర కుట్ర భగ్నం..!
భారత వాణిజ్య రాజధాని ముంబైలో (Mumbai) ఉగ్రదాడులకు (Terror Attacks)పన్నిన కుట్రను ఎన్‌ఐఏ (NIA) భగ్నం చేసింది. 40 డ్రోన్లను (Drones) ఉపయోగించి ముంబైలో దాడులకు పాల్పడాలన్న కుట్రను ఎన్‌ఐఏ భగ్నం చేసింది.
భారత వాణిజ్య రాజధాని ముంబైలో (Mumbai) ఉగ్రదాడులకు (Terror Attacks)పన్నిన కుట్రను ఎన్‌ఐఏ (NIA) భగ్నం చేసింది. 40 డ్రోన్లను (Drones) ఉపయోగించి ముంబైలో దాడులకు పాల్పడాలన్న కుట్రను ఎన్‌ఐఏ భగ్నం చేసింది. ముంబైకి ఉత్తరాన 53 కి.మీ.దూరంలోని పద్ఘా (Padhgha) గ్రామంలో తలదాచుకున్న నిందితుడు, ఐఎస్ మాడ్యుల్‌కు చెందిన సాకిబ్ నాచన్‌ను (Sakib Nachan) అరెస్ట్ చేశారు. ఖలీఫాకు (Khaleefa) చెందిన ఉగ్రవాది సాకిబ్ నాన్, అతని కుమారుడ్ షామిల్‌కు (Shamil) కూడా పేలుడు పదార్థాల (Bombs) తయారీ, శిక్షణ ఇచ్చినట్లు తెలిసింది. షామిల్‌ను కూడా ఎన్‌ఐఏ అరెస్ట్ చేసింది. నాచన్ బందువులు రజిల్ అబ్దుల్ లతీఫ్ (Abdul lathif), రఫిల్ (Rafil), నాచన్ (Nachan)లను ఎన్‌ఐఏ అరెస్ట్ చేసింది. ఈ దాడుల్లో భారీగా ఆయుధాలు, హమాస్ జెండాలు (Hamas Flags), రూ.68 లక్షల నగదు, 38 సెల్‌ఫోన్లు, 3 హార్డ్ డిస్క్‌లను (Hard Disk)స్వాధీనం చేసుకున్నారు.పద్ఘా గ్రామాన్ని అల్-షామ్‌గా మార్చి స్వతంత్ర రాష్ట్రంగా ప్రకటించుకున్నారు. అక్కడ ఐసిస్ (ISIS) ఉగ్రవాదులకు శిక్షణ ఇస్తున్నట్లు సమాచారం.