కరోనా వైరస్‌(Corona Virus)తోనే ప్రపంచం కకావికలం అవుతుంటే, ఇప్పుడు మరో వైరస్‌ గజగజమని వణికిస్తోంది. డాక్టర్లకే అంతుచిక్కని ఆ కొత్త వైరస్‌(New Virus) కారణంగా ఇప్పటికే ముగ్గురు చనిపోయారు. వైరస్‌ను ఎలా అదుపు చేయాలో, వైరస్‌ సోకిన వారికి ఎలా చికిత్సను అందించాలో తెలియక డాక్టర్లు ఆందోళన చెందుతున్నారు. ఆఫ్రికా(Africa)లో నెమ్మదిగా వ్యాపిస్తున్న ఈ వైరస్‌ను కట్టడి చేయడానికి అధికారులు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు.

కరోనా వైరస్‌(Corona Virus)తోనే ప్రపంచం కకావికలం అవుతుంటే, ఇప్పుడు మరో వైరస్‌ గజగజమని వణికిస్తోంది. డాక్టర్లకే అంతుచిక్కని ఆ కొత్త వైరస్‌(New Virus) కారణంగా ఇప్పటికే ముగ్గురు చనిపోయారు. వైరస్‌ను ఎలా అదుపు చేయాలో, వైరస్‌ సోకిన వారికి ఎలా చికిత్సను అందించాలో తెలియక డాక్టర్లు ఆందోళన చెందుతున్నారు. ఆఫ్రికా(Africa)లో నెమ్మదిగా వ్యాపిస్తున్న ఈ వైరస్‌ను కట్టడి చేయడానికి అధికారులు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ఆఫ్రికా ఖండంలో బురుండి(Burundi) అనే చిన్న దేశం ఉంది.. ఆ దేశంలో బజిరో(Bajirao)లో అనే ప్రాంతం ఉంది. అక్కడే కొత్త వైరస్‌ పుట్టుకొచ్చింది. అంతుపట్టన ఆ వైరస్‌ ఇప్పటికే ముగ్గురిని బలి తీసుకుంది. వైరస్‌ బారిన పడిన వారికి ముందుగా జ్వరం సోకుతుంది. తర్వాత వాంతులు, తలనొప్పి వస్తుంది. ఆ తర్వాత ప్రాణాలు పోతాయి. ఇదే సమయంలో వైరస్‌ సోకిన వారికి ముక్కు నుంచి రక్తం కారుతుందని వైద్యులు చెబుతున్నారు. ఇలాంటి లక్షణాలు ఉన్నవారు వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు. వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో బురుండి దేశ ఆరోగ్య శాఖ అధికారులు అలెర్టయ్యారు. బజిరోలో పట్టణం మొత్తం క్వారంటైన్‌ చేశారు. రాకపోకలను పూర్తిగా ఆపేశారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా రంగంలోకి దిగింది. బురుండి చుట్టుపక్కల దేశాలను హెచ్చరించింది. ఆరోగ్యశాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. బురుండి పక్కనే ఉన్న టాంజానియాలో మొన్నీమధ్య మార్‌బర్గ్‌ అనే వైరస్‌ వ్యాపించింది. బురుండిలో వెలుగుచూసిన వైరస్‌ అదేనేమోనని కొందరు సందేహపడుతున్నారు. అయితే బురుండిలో ఎబోలా, మార్‌బర్గ్‌ వంటి వైరస్‌లు వ్యాప్తి చెందే ఛాన్స్‌ లేదని ఆ దేశ ఆరోగ్య శాఖ అధికారులు అంటున్నారు.

Updated On 31 March 2023 2:45 AM GMT
Ehatv

Ehatv

Next Story