చైనా పేరు వింటేనే ప్రపంచం అల్లకల్లోలం అయ్యే పరిస్థితి నెలకొంది. కళ్ల ముందు కోవిడ్ కష్టాలు కనపడుతుంటే అక్కడే మరో వైరస్ పుట్టుకొచ్చింది.

చైనా పేరు వింటేనే ప్రపంచం అల్లకల్లోలం అయ్యే పరిస్థితి నెలకొంది. కళ్ల ముందు కోవిడ్ కష్టాలు కనపడుతుంటే అక్కడే మరో వైరస్ పుట్టుకొచ్చింది. ఈ వైరస్ వల్ల ఆ దేశంలో ఇప్పటికే వేలాది సంఖ్యల్లో ప్రజలు ఆస్పత్రుల పాలవుతున్నారు. చైనాలో హ్యూమన్‌ మెటానిమోవైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్నట్లు వార్తలు వచ్చాయి. హెచ్‌ఎంపీవీ అనేది ఆర్‌ఎన్‌ఏ వైరస్. ఇది న్యూమోవిరిడే, మెటాప్న్యూమోవైరస్ జాతికి చెందినది. ఈ వైరస్ సోకి ఇప్పటికే వేలాది మంది చైనీయులు ఆస్పత్రుల పాలయ్యారని అక్కడి మీడియా కోడై కూస్తోంది. ఈ వైరస్‌కు తోడుగా ఇన్‌ఫ్లూయెంజా ఏ, మైకోప్లాస్మా, నిమోనియా, కోవిడ్-19 వైరస్‌లు కూడా వ్యాప్తి చెందుతున్నట్లు సోషల్ మీడియా కోడై కూస్తోంది. ఏకంగా హెల్త్‌ ఎమర్జెన్సీ కూడా ప్రకటించినట్లు వార్తలు వచ్చినా దీనిపై అక్కడి ప్రభుత్వం నుంచి స్పష్టత రాలేదు.

హెచ్‌ఎంపీవీ వైరస్‌ కూడా కోవిడ్ లక్షణాలే ఉన్నట్లు తెలుస్తోంది. ఊపిరితిత్తుల్లో ఇన్‌ఫెక్షన్‌లతో బాధపడుతున్న పిల్లల శాంపిల్స్‌ను అధ్యయనం చేస్తున్న డచ్‌ పరిశోధకులు 2001లోనే దీన్ని కనిపెనిట్టినట్లు తెలుస్తోంది. అయితే దాదాపు 25 ఏళ్లు ఇది మనుగడలోనే ఉన్నా ఇప్పుడు ఇది విస్తరించడంతో అక్కడి ప్రభుత్వం తమ దేశ ప్రజలను అప్రమత్తం చేస్తోంది. మాస్కులు ధరించాలని, తరుచూ చేతులు శుభ్రం చేసుకోవాలని సూచిస్తోంది. ఈ వైరస్ వ్యాప్తిని వైద్యాధికారులు నిశితంగా పరిశీలిస్తున్నారు. ముఖ్యంగా HMPV వైరస్‌ కేసులు డిసెంబరు 16 నుంచి 22 మధ్య అధిక సంఖ్యలో నమోదైనట్లు ఓ మీడియా సంస్థ వెల్లడించింది. దీంతో కోవిడ్ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని చైనా ముందస్తు జాగ్రత్తలు చేపట్టింది.

ముఖ్యంగా రోగనిరోధక శక్తి తక్కువ ఉన్నవారిపై ఈ వైరస్ ఎక్కువ దాడి చేస్తోంది. తుమ్ముల ద్వారా ఒకరి నుంచి మరొకరికి ఇది వేగంగా వ్యాప్తి చెందుతోంది. దగ్గు, జలుబు, ముక్కు దిబ్బడ, జ్వరం వంటి లక్షణాలు ఉంటాయి. అయితే వైరస్‌కు టీకాలు అందుబాటులో లేవని.. ఉన్నవాటితోనే దీనిని నియంత్రించేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్తున్నారు. దీని నివారణకు మాస్క్‌లు ధరించడం, సామాజిక దూరం పాటించడం, తరచుగా చేతులు కడుక్కోవడం, రద్దీగా ఉండే ప్రాంతాలకు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు.

ehatv

ehatv

Next Story